థియేటర్లలో ‘కాంతార’ జోరు తగ్గట్లేదు. కలెక్షన్స్ ఆగట్లేదు. ఒరిజినల్ వెర్షన్ కన్నడలో 50 రోజులకు దగ్గర్లో ఉంది. ఇలాంటి టైంలో ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఇకపోతే గత కొన్ని వారాల నుంచి సినిమా ప్రేమికుల మధ్య డిస్కషన్ లో నిలిచిన మూవీ ఏదైనా ఉందంటే అది ‘కాంతార’ మాత్రమే. ఇక ఈ మూవీ కన్నడతో పాటు తెలుగు, హిందీలోనూ సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ‘కాంతార’ మరో ఘనత సాధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. జస్ట్ 15 కోట్లతో తీసిన మూవీ ‘కాంతార’. ఫస్ట్ కన్నడలో మాత్రమే రిలీజ్ చేశారు. కర్ణాటకకు చెందిన భూతకోల ఆధారంగా ఈ స్టోరీ కాబట్టి.. మిగతా రాష్ట్రాల వాళ్లకు ఇది కనెక్ట్ కాకపోవచ్చని భావించారు. అయితే అనుహ్యంగా కన్నడ కంటే మిగతా భాషల ప్రేక్షకులు ఈ మూవీపై తెగ ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. కేవలం రెండు కోట్లకు తెలుగు రైట్స్ కొనగా, ఇప్పటివరకు రూ.50 కోట్లపైనే వసూళ్లు సాధించింది. ఓ డబ్బింగ్ సినిమా.. ఈ కాలంలో అది ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం నిజంగా గ్రేట్. ఇప్పటికీ థియేటర్లకి వెళ్లి మరీ ఈ మూవీ చూస్తున్నారంటే.. ‘కాంతార’ స్టామినా ఏంటో మీరు అర్ధం చేసుకోవచ్చు.
ఇకపోతే ‘కాంతార’.. కన్నడ వెర్షన్ లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే కన్నడ ఇండస్ట్రీ హిట్, ఆల్ టైమ్ కలెక్షన్స్ రికార్డ్స్ సెట్ చేసిన మూవీ ‘కేజీఎఫ్ 2’. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా.. ఓన్లీ కన్నడలో రూ.155 కోట్ల(నెట్) వసూళ్లు సాధించింది. ఇప్పుడు దీన్నే ‘కాంతార’ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. శనివారంతో ఈ మార్క్ ని ‘కాంతార’ అధిగమించినట్లు ఇండస్ట్రీలో వర్గాల్లో సమాచారం. అయితే ఈ విషయమై నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే కేజీఎఫ్ 2, కాంతార ప్రొడ్యూస్ చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ కావడం మరో విశేషం. ప్రస్తుతం వీళ్లు ప్రభాస్ ‘సలార్’ తీస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న రిలీజయ్యే ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి!