నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. డెబ్యూ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ టైమ్ ట్రావెలింగ్ మూవీ ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ ఉన్నటువంటి పాత్రలలో కనిపించనుండగా.. సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇందులో బింబిసారుడిగా పవర్ ఫుల్ పాత్రలో కళ్యాణ్ రామ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవలే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. అయితే.. హీరో కళ్యాణ్ రామ్ తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాత్రికేయులు.. ‘బింబిసార చిత్రం బిగ్ స్కేల్ లో వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ గ్రాండియర్ లుక్, విఎఫ్ఎక్స్ పరంగా పెద్ద సినిమాగా అనిపిస్తుంది. బింబిసారను బాహుబలి లైన్ లో చేర్చి.. మరో బాహుబలి తర్వాత అంతటి బిగ్ మూవీ అనుకోవచ్చా?’ అని కళ్యాణ్ రామ్ ని అడగగా.. “ప్లీజ్ బింబిసారను బాహుబలితో పోల్చకండి. ఆ సినిమా వందల కోట్ల వరకు వెళ్ళింది. ఇది మేము మాకున్న బడ్జెట్, పరిధిలో రిచ్ గా తీశాం.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి బింబిసార మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.