ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగు సినీ స్థాయిని మరింత పెంచేసింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన, గుండెని పిండేసే సన్నివేశాలు, మనసుని రంజింపజేసే పాటలు, ఉత్కంఠను పెంచే పోరాట సన్నివేశాలు.. ఇలా ఒకటేమిటి ప్రతీ సన్నివేశం ఒక మైలురాయిగా నిలిచింది. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే సినిమా తీసి తెలుగోళ్ల సత్తా చాటారు రాజమౌళి. అలాంటి ఈ సినిమాకి ఆస్కార్ కి నామినేట్ అవుతుందని చాలా మంది భావించారు. అయితే దీని కంటే ముందు ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్స్’ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాని వరించింది.
నాటు నాటు పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. చిన్నా, పెద్దా, పేద, ధనిక అని తేడా లేకుండా చాలా మంది ఈ పాటకి స్టెప్పులు వేసి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాంటి నాటు నాటు పాట మనల్నే కాదు.. హాలీవుడ్ వాళ్ళని కూడా ఉర్రూతలూగించింది. అందుకే ఈ పాటకి అవార్డు ఇవ్వకుండా ఉండలేకపోయారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డుని ఎం.ఎం. కీరవాణి అందుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరకూ ప్రతీ ఒక్కరూ ఈ సినిమాకి అవార్డు రావడంపై అభినందనలు తెలియజేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సినిమాకి అవార్డు రావడంపై స్పందించారు.
Thank you so much mavayya.
— Jr NTR (@tarak9999) January 11, 2023
‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆర్ఆర్ఆర్ సినిమాకి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎం.ఎం. కీరవాణి, ఎస్.ఎస్. రాజమౌళి, సినిమా బృందం మొత్తానికి అభినందనలు. ఖచ్చితంగా గర్వంగా ఉంది. గతంలో చెప్పినట్టు.. తెలుగు భాష ఇప్పుడు భారతీయ భాషల్లో శక్తివంతమైన భాషగా మారింది’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. ‘థాంక్యూ సో మచ్ మావయ్య’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ మావయ్య అంటూ ఆప్యాయంగా ట్వీట్ పెట్టడంపై టీడీపీ వర్గాల్లో ఒక రకమైన జోష్ నెలకొంది. మరి తారక్ ట్వీట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. అలానే నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది కాబట్టి ఆర్ఆర్ఆర్ టీమ్ కి అభినందనలు తెలియజేయండి.