సమంత.. ఇండియన్ సినిమాలో ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరోయిన్‌గా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. చేతిలో వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్‌గా కెరీర్‌లో దూసుకుపోతోంది. ఒక స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ బేస్‌ని, స్టార్డమ్‌ని సొంతం చేసుకుంది. హీరోలతో పోటీపడుతూ రెమ్యూనరేష్ తీసుకుంటోంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ అందరిని ఎంతో మోటివేట్ చేసే సమంత ప్రస్తుతం తన జీవితంలో గడ్డుకాలాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఒక అరుదైన, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నట్లు సమంత వెల్లడించి అందరినీ షాక్‌కు గురి చేసింది. సమంత పోస్ట్ చూసి యావత్ సినీ ప్రపంచం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.
తాను గత కొద్దిరోజులుగా ఒక అరుదైన వ్యాధితో పోరాడుతున్నట్లు తెలియజేసింది. “గత కొద్దినెలల క్రితం నాకు మ్యోసిటీస్ అనే వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తారు. ఈ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాతే ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకున్నాను. కానీ, అందుకు ఇంకా కాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉంది. ప్రతిసారి మనం ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే నేను ఎదుర్కొంటున్నానో అలాంటి స్థితిని కూడా కొన్నిసార్లు అంగీకరించాలి. అతి త్వరలో నేను పూర్తిగా కోలుకుంటానంటూ వైద్యులు బలంగా నమ్ముతున్నారు. శారీరకంగా, మానసికంగా నాకు ఎన్నో మంచి రోజులు, కొన్ని చెడు రోజులు ఉన్నాయి. ఇది కూడా తప్పకుండా వెళ్లిపోతుంది” అంటూ సమంత ఎంతో ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది.
సమంత పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. సమంత ఎంతో ధైర్యవంతురాలు.. ఆమె ఈ పరిస్థితిని కూడా అధిగమిస్తుంది అంటూ ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు. సమంత అనారోగ్యంపై అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. “గెట్ వెల్ సూన్ శామ్.. సెండింగ్ యూ ఆల్ ది స్ట్రెంథ్” అంటూ తారక్ సమంతకు తన మద్దతు తెలియజేశాడు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో ఉన్న టాప్ హీరోయిన్లు అంతా సమంత పోస్టుకు కామెంట్స్ రూపంలో వారి సపోర్ట్ ని తెలియజేశారు. హన్సిక, కృతిసనన్, రష్మిక, కియారా అద్వానీ, జాన్వీ కపూర్, డింపుల్ హయాతీ, మంచు లక్ష్మి, శ్రియ, నందిని రెడ్డి, కొణిదెల సుశ్మిత, దివ్య స్పందన, డిజైనర్ జుకల్కర్ వంటి వారంతా స్పందించారు. సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Get well soon Sam. Sending you all the strength.
— Jr NTR (@tarak9999) October 29, 2022