సినిమా సినిమాకి మధ్య ఖాళీ సమయం దొరికినప్పుడు సెలబ్రిటీలు ఫ్యామిలీస్ తో ఫారెన్ టూర్స్ కి వెళ్లడం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా స్టార్ హీరోలు ఫ్యామిలీస్ తో వెళ్ళినప్పుడు వాళ్ళ టూర్ పిక్స్ ఎప్పుడైనా వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ టూర్ వెళ్తున్న విషయం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అదేంటీ.. హీరోలు ఫారెన్ టూర్స్ కి వెళ్లడం మామూలే కదా! అనుకోవచ్చు. సాధారణంగా స్టార్ హీరోలు ఫ్యామిలీస్ తో వారం, రెండు వారాలు లేదా మూడు వారాలు వెళ్లడం ఎక్కువగా చూశాం. కానీ, ఎన్టీఆర్ ఏకంగా నెలరోజుల పాటు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ కారణంగానే ఇప్పుడీ విషయం వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్.. తదుపరి సినిమాను డైరెక్టర్ కొరటాల శివతో చేయాల్సి ఉంది. కాగా.. ఇప్పటికీ, ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉండేసరికి ఫ్యాన్స్ అంతా నిరాశకు లోనవుతున్నారు. అయినాసరే పకడ్బందీగా ప్లాన్ చేసి హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు ఎన్టీఆర్ – కొరటాల. వీరి కాంబినేషన్ లో ఇదివరకే ‘జనతా గ్యారేజ్’ సినిమా హిట్ చూశాం. పైగా ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పాకింది. కాబట్టి, కొరటాలపై బాధ్యత చాలా ఉంది. అయితే.. ఎన్టీఆర్ కోసం ముందుగా అనుకున్న స్టోరీని పాన్ ఇండియా మెచ్చే స్క్రిప్టుగా మార్చే దశలో మరింత ఆలస్యం అవుతోందని టాక్.
ఇదిలా ఉండగా.. సినిమా మొదలయ్యే గ్యాప్ లో పలు కమర్షియల్ యాడ్స్ లో నటించిన ఎన్టీఆర్.. తాజాగా ఫ్యామిలీతో లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసి అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. అదికూడా నెలరోజుల పాటు అక్కడే ఉండబోతున్నట్లు సమాచారం. కాగా.. ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ ఫ్యామిలీతో వెకేషన్ కి బయలుదేరిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో న్యూఇయర్ ని కూడా ఎన్టీఆర్ అక్కడే జరుపుకోనున్నాడని, సంక్రాంతి వరకు మళ్లీ హైదరాబాద్ కి తిరిగివస్తారని అంటున్నారు. అదీగాక కొరటాల సినిమా కూడా సంక్రాంతి తర్వాతే మొదలు కానుందట. ఇప్పటికే ఎన్టీఆర్ మూవీ కోసం అనిరుధ్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు కొరటాల. చూడాలి మరి వీరి కాంబినేషన్ లో ఈసారి ఎలాంటి సినిమా రాబోతుందో!
#jrntr and his family heading to #usa for a much needed break ❤️!@jrntr
.
.
.#ntr #ntrfans #ntr30 #jrntr #ntrjr pic.twitter.com/Sq03Ft746x— SIIMA (@siima) December 10, 2022
#NTR spotted at airport leaving on a month long personal holiday to the USA with his family. @tarak9999 #JrNTR pic.twitter.com/6g9UGRCCRz
— Suresh Kondi (@SureshKondi_) December 9, 2022