Satya Sri: తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్న కామెడీ షోలలో జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. ఎంతోమంది టాలెంట్ ఉన్న సాధారణ వ్యక్తులను సెలబ్రిటీలుగా మార్చిన జబర్దస్త్.. దాదాపు ఎనిమిదేళ్ల నుండి విజయవంతంగా ప్రసారమవుతూ ప్రేక్షకాదరణ పొందుతోంది. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మొదట ఎంట్రీ ఇచ్చినవారిలో సత్య శ్రీ ఒకరు.
సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో మెరిసిన సత్యశ్రీని చమ్మక్ చంద్రనే జబర్దస్త్ కి పరిచయం చేశాడు. వెండితెరపై పలు సినిమాలలో కనిపించినా.. సత్యశ్రీ అంటే బయట ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కానీ.. ఎప్పుడైతే జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిందో.. తనేంటో నిరూపించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అలాగే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.
జబర్దస్త్ లో తొలి లేడీ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సత్యశ్రీ.. చమ్మక్ చంద్రతో పాటు జబర్దస్త్ నుండి బయటకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంతోమంది లేడీ కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. తాజాగా సత్యశ్రీ కెరీర్ ఆరంభంలో అందరూ అమ్మాయిలు ఫేస్ చేసినట్లుగా.. పర్సనల్ గా లేదా ఫిజికల్ గా ఏవైనా సమస్యలు ఎదుర్కొందా? అనే విషయంపై సుమన్ టీవీ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
ఇంటర్వ్యూలో తన కెరీర్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, చదువు ఇలా అన్ని విషయాలను షేర్ చేసుకున్న సత్యశ్రీ.. జబర్దస్త్ నుండి వెళ్లిపోవడానికి కారణం బయట పెట్టింది. ఇక కెరీర్ లో దేవుడి దయవల్ల ఫిజికల్ గా నాకు ఎప్పుడూ సమస్యలు రాలేదు. కానీ.. మొదట్లో ఫేస్ చూసి నీకేం యాక్టింగ్ వచ్చు.. అని ముఖం మీదే అనేవారు. నేను ఆ కామెంట్స్ అన్నింటిని పాజిటివ్ గా తీసుకొని ఈరోజు ప్రూవ్ చేసుకున్నాను. అలాగే నాకు ఎలాగో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సత్యశ్రీ ఫుల్ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతుంది. మరి సత్యశ్రీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.