బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ నూకరాజు గురించి పరిచయం అక్కర్లేదు. పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన నూకరాజు.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ జబర్దస్త్ లో అవకాశం అందుకున్నాడు. అప్పటినుండి చలాకి చంటి టీమ్ లో సభ్యుడిగా ఉంటూ స్కిట్స్ చేస్తున్నాడు. అలా జబర్దస్త్ తో పాటు ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎంటర్టైన్ మెంట్ షోస్ అన్నింట్లో తనదైన పెర్ఫార్మన్స్ లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయితే.. చదువు లేకపోయినా కేవలం టాలెంట్, హార్డ్ వర్క్ తో పైకొచ్చిన నూకరాజు లైఫ్, కెరీర్, ఫ్యామిలీ పరంగా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. చివరికి రీసెంట్ గా జబర్దస్త్ లో టీమ్ లీడర్ అయ్యాడు.
ఇంతకాలం చలాకి చంటి టీమ్ లో ఉన్న నూకరాజు.. ఇప్పుడు ‘నాన్ స్టాప్ నూకరాజు’ అనే టీమ్ పేరుతో స్కిట్స్ చేస్తున్నాడు. కాగా.. పర్సనల్ లైఫ్ పరంగా నూకరాజు.. పటాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన ‘ఆసియా’తో ప్రేమలో పడ్డాడు. పటాస్ ప్రోగ్రాంలోనే నూకరాజు, ఆసియా పరిచయం అవ్వడమే కాకుండా.. పరిచయం కాస్త పెరిగి ఆఖరికి ప్రేమలో పడ్డారు. అప్పటినుండి కలిసి జర్నీ చేస్తున్న నూకరాజు, ఆసియా తమ లవ్ స్టోరీని సుమన్ టీవీ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలాగే అదే ఇంటర్వ్యూలో మొదటిసారి ఆసియా నూకరాజుకి లవ్ ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. మరో వీడియోతో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది ఆసియా.
అవును.. ప్రేమించిన వారికి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది మామూలే. కానీ, మరీ ఖరీదైన బహుమతులు ఇచ్చినప్పుడే ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటారు. తాజాగా నూకరాజు అలాంటి సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రియురాలు ఆసియాకి నూకరాజు ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. రోజు బైక్ పై తిరగడం కష్టంగా ఉందని.. ఆసియా కోసం కారు కొంటున్నట్లు చెప్పాడు. అయితే.. ఇంతకీ నూకరాజు ఆసియా కోసం కొన్న కారు ఏదో తెలుసా? కియా కంపెనీకి చెందిన సెల్టాస్(Seltos) కారును కొనుగోలు చేశాడు నూకరాజు. ఈ కారు ధర ప్రస్తుతం మార్కెట్ లో సుమారు రూ. 14 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక నూకరాజు తన కారు కొన్న వీడియోని స్వయంగా ఆసియానే యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. మరి నూకరాజు – ఆసియాల జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.