తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్న కామెడీ షో ‘జబర్దస్త్’. ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. తొమ్మిదేళ్ల నుంచి నిర్విరామంగా ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. అయితే గత రెండు మూడేళ్ల కాలంలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో చాలా మార్పులొచ్చాయి. జడ్జిలు నాగబాబు, రోజాతో పాటు పలువురు స్టార్ టీమ్ లీడర్స్.. షో వదిలిపెట్టి వెళ్లిపోయారు. మొదట్లో కాస్త తడబడినప్పటికీ ఇప్పుడు మాత్రం అదే రేంజ్ లో అలరిస్తూనే వచ్చింది. ఇక ఈ షోకు యాంకర్ అనగానే అనసూయ. రష్మీనే గుర్తొస్తారు. అలాంటిది కొన్నాళ్ల ముందు అనసూయ షో వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ఆమె స్థానంలో రష్మీనే యాంకరింగ్ చేస్తూ వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు కొత్త యాంకర్ ని తీసుకొచ్చారు. ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగానే కొత్త యాంకర్ అనగానే ఆమె గ్లామర్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ కూడా తెగ సెర్చ్ చేస్తారు. ఇక ‘జబర్దస్త్’ షోకి కొత్తగా వచ్చిన యాంకర్ పేరు సౌమ్య రావు. టీవీ సీరియల్స్ చూసే వాళ్లకు పరిచయమే. మొన్నటికి మొన్న ఈటీవీ 27 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో హైపర్ ఆదిపై వరసపెట్టి పంచులేసినా ఈమె.. చాలామంది దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ఈమెని యాంకర్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం అనసూయ.. షో వదిలి వెళ్లిపోయినప్పుడు చాలామంది కొత్త యాంకర్స్ పేర్లు వినిపించాయి కానీ రష్మీని తీసుకొచ్చి ఇక్కడ కూడా కూర్చోబెట్టారు. దీంతో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. మొత్తం అన్ని షోల్లోనూ రష్మీనే ఉంటే ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ కావొచ్చని సౌమ్య రావుని యాంకర్ గా తీసుకొచ్చేశారు. వస్తూ వస్తూనే హైపర్ ఆదిపై పంచులేసిన ఈమె.. తన మార్క్ చూపించింది.
కర్ణాటకలో పుట్టి పెరిగిన సౌమ్య అసలు పేరు సౌమ్య శారద. శివమొగ్గ ఈమె సొంతూరు. నటి కాకముందు మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. బెంగళూరు స్టడీస్ పూర్తి కాగానే ఓ కన్నడ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా చేరింది. యాక్టింగ్ పై ఉన్న ఆసక్తి కారణంగా సీరియల్స్ లో అవకాశాల కోసం ప్రయత్నించింది. అలా కన్నడలోనే ‘పత్తేదారి ప్రతిభ’ సీరియల్ తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలోనూ పలు సీరియల్స్ లో యాక్ట్ చేసింది. ఈమె కళ్లు చూస్తే విలన్ పాత్రలే గుర్తొస్తాయి. అందుకేనేమో తొలి సీరియల్ నుంచి సౌమ్యకు అలాంటి పాత్రలే వచ్చాయి. వాటినే అద్భుతంగా చేసిన ఈమె.. తన ఈ టైప్ ఆఫ్ రోల్స్ కి ఫెర్ఫెక్ట్ అనిపించుకుంది. ఇక మనసిచ్చి చూడు(డబ్బింగ్), హిట్లర్ గారి పెళ్లాం(తమిళ వెర్షన్) సీరియల్స్ లో యాక్ట్ చేసింది. తెలుగులో ‘శ్రీమంతుడు’ సీరియల్ లో సత్యగా నటించి ఎంట్రీ ఇచ్చింది. అందులో నటిస్తున్న ఆమెను.. ఇప్పుడు ‘జబర్దస్త్’ కొత్త యాంకర్ గా చేశారు. కన్నడిగ అయిన ఈమె.. ‘జబర్దస్త్’ యాంకర్ గా ఏ మేరకు ఎంటర్ టైన్ చేస్తుంది. రష్మీ, అనసూయలా ఎంతవరకు నిలబడుతుంది అనేది తెలియాల్సి ఉంది.