తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ వర్ష – ఇమ్మానుయేల్ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీల జంట తర్వాత బుల్లితెరపై ఆ స్థాయి క్రేజ్ దక్కించుకుంటున్నారు వర్ష – ఇమ్మానుయేల్. అయితే.. ఎంటర్టైన్ మెంట్ షోలు అన్నాక.. అందులోనూ జబర్దస్త్ షో లాంటివి కామెడీ పంచులపై రన్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పంచులు వేసుకొని కామెడీ పండించడంలో తప్పులేదు. కానీ ఆ పంచులు శృతిమించి ఎదుటివారిని బాధించేలా ఉంటే తప్పే అంటున్నారు ప్రేక్షకులు.
తాజాగా వచ్చేవారానికి సంబంధించి ‘జబర్దస్త్’ ప్రోమో విడుదలైంది. ప్రోమో అంతా సాఫీగానే సాగింది.. కానీ వర్ష – ఇమ్మానుయేల్ స్కిట్ వచ్చేసరికి పంచులు శృతిమించి, అర్థాలు మారుతున్నాయని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇదివరకు జబర్దస్త్ స్కిట్ లలో ఆడవాళ్లు లేక మగవారే ఆ గెటప్పులు ధరించేవారు. మగాళ్లే లేడీ వేషం వేసేసరికి పంచులు తేడా, చెక్కా అనే పదాలతో దారుణంగా ఉండేవి.ఇప్పుడు స్కిట్ లలో అమ్మాయిలే పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇదివరకు లేడీ గెటప్స్ పై వేసిన పంచులకంటే దారుణంగా అమ్మాయిలపై ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ వర్ష పై ఇమ్మానుయేల్ చేసే కామెంట్స్ ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. ఇదివరకే ఓ ప్రోగ్రాంలో ఆమె బాధపడి.. అలా అనొద్దని చెబుతూ స్టేజి దిగి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అయినా వారి పంథా మారనట్లే కనిపిస్తుంది. తాజాగా వీరి స్కిట్ లో.. నరేష్ చేసిన కామెంట్స్ చర్చలకు దారితీశాయి.
స్కిట్ లో వర్ష.. ‘మీరు ముగ్గురు చెక్కలని ముందే చెప్పాను కదరా’ అని నరేష్, ఇమ్మానుయేల్, ఇంకొకరి పై పంచ్ వేసింది. వెంటనే రియాక్ట్ అయిన నరేష్.. ‘మేం ముగ్గురు కాదు.. నలుగురం. ఆ నాలుగోది ఎవర్తో కాదు.. ఇదే’ అంటూ వర్షను చూపిస్తాడు. ప్రస్తుతం నరేష్ మాటలపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షను అలా ఇంకెంతకాలం అవమానిస్తారని అంటున్నారు. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.