జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. రాయలసీమ యాసలో తనదైన కామెడీని పండించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆర్పీ.. కొన్నేళ్ల క్రితమే జబర్దస్త్ ని వీడి ప్రస్తుతం “కామెడీ స్టార్స్” షోలో స్కిట్స్ చేస్తున్నాడు. తనదైన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం సంపాదించాడు. ఇక కిరాక్ ఆర్పీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తాను ప్రేమించిన లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నా విషయం తెలిసిందే. అయితే కిరాక్ ప్రేమ.. పెళ్లి పీటల వరకు అంత సులువుగా రాలేదు. ప్రేమ కోసం ఆర్పీ ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడ్డాడు. “పార్టీ చేద్దాం పుష్ప”అనే ప్రోగ్రామ్ లో కిరాక్ ఆర్పీ ప్రేమ సంగతులు బయటకి వచ్చాయి. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు.
ప్రోమో వీడియోలో.. తనను అభిమానించి, సెల్పీ దిగేందుకు వచ్చిన అమ్మాయినే.. ఆర్పీ ప్రేమించాడు. కిరాక్ ఆర్పీ.. తన ప్రేమను గెలిపించుకునేందుకు పడిన కష్టాలు అన్ని ఇన్నీ కావు. “నేను లక్కీని ఇష్టపడుతున్నాను” అంటూ ఆర్పీ.. లక్ష్మి ప్రసన్న కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. ఈ సినిమా వాళ్లను ఎలా నమ్మాలి అంటూ మొదట వారి పెళ్లికి నిరాకరించారు. అయిన తన ప్రేమను చంపుకోలేక ఆ అమ్మాయితో తన పెళ్లి చేయించాలని చాలా మందిని బ్రతిమిలాడుతాడు. ఆ లక్ష్మిపై ఆర్పీ ఎంతాగా ప్రేమించాడో స్వయంగా చూసి అమ్మాయి కుటుంబ సభ్యులు..వారి వివాహాన్నికి ఒప్పుకున్నారు. అలా తన ప్రేమను గెలిపించుకుని త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు ఆర్పీ. “పార్టీ చేద్దాం పుష్పా” లో ఆర్పీ..లవ్ స్టోరీని కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి… కిరాక్ ఆర్పీ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Dil Raju: పండంటి బాబుకు జన్మనిచ్చిన నిర్మాత దిల్ రాజు భార్య!