హర్షసాయి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరిది. యూట్యూబర్‌గా తెలుగులో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. యూట్యూబర్‌గా ఉంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు. యూట్యూబ్ ద్వారా వచ్చే తన ఆదాయం మొత్తాన్ని పేదలకు పంచి పెడుతున్నాడు. వేలు, లక్షల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంగా పేదలకు పంచేస్తున్నాడు. అవసరం ఉన్నవారి గురించి తెలుసుకుని మరీ సహాయం చేస్తున్నాడు. హర్షసాయి మంచి తనమే అతడ్ని అందరికంటే ప్రత్యేకమైనవాడిగా నిలిపింది. తనకంటూ ఓ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. ఇక, అతడి యూట్యూబ్ ఛానళ్లకు మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
కేవలం తెలుగులోనే కాదు.. వివిధ భాషల్లో అతడికి యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. ఇలా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హర్షసాయికి సంబంధించిన ఓ విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ విషయం ఓ రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ సంగతేంటంటే.. హర్షసాయి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. జనసేన పార్టీలో చేరనున్నారట. జనసేన తరపునుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారట. పవన్ సేవా తత్పరతకు ముగ్ధుడైన హర్షసాయి జనసేనలోకి వెళ్లాలని అనుకుంటున్నారట.
ఈ మేరకు సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. దీనికి సంబంధించే సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు.. హర్షసాయి జనసేన పార్టీలో చేరిపోయాడంటూ కూడా వీడియోలు చేసేశాయి. అయితే, హర్షసాయి జనసేన పార్టీలో చేరబోతున్నారన్న దానిపై అటు హర్షసాయి నుంచి గానీ, జనసేన పార్టీనుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే.. హర్షసాయి గానీ, జనసేన గానీ స్పందించాల్సిందే. మరి, జనసేనలోకి హర్షసాయి?ఎమ్మెల్యేగా పోటీ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.