కల్యాణి.. ఈ మలయాళీ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితం. జగపతిబాబు, రవితేజ, వెంకటేశ్ లతో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా మారిన సూర్య కిరణ్ ను 2005లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. చాలా మందికి అసలు కారణం ఏంటనేది తెలియదు. ఇటీవల సూర్య కిరణ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి వివాహ బంధానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మొదట్లో అంతా తమది ప్రేమ వివాహం అనుకున్నారని.. కానీ, వారిది పెద్దలు కుదిర్చిన వివాహమని సూర్య కిరణ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా వారి మధ్య అస్సలు చిన్నపాటి గొడవ కాలేదని చెప్పుకొచ్చారు. కోర్టులో జడ్డి అడిగినా ఆమె ఏ సమాధానం చెప్పలేదని తెలియజేశారు. కోర్టు నుంచి బయటకు వచ్చాక అప్పులన్నీ తీరాక మళ్లీ మనం పెళ్లి చేసుకుందామని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.
అయితే ఇప్పుడు అంతా సూర్య కిరణ్ కి ఉన్న అప్పుల కారణంగానే కల్యాణి విడాకులు తీసుకుని ఉండచ్చని అంతా భావిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు గతంలోనూ ఇండస్ట్రీలో కొన్ని జరిగాయంటూ ఉదాహరణలు తీయడం ప్రారంభించారు. సూర్య కిరణ్ అప్పుల్లో మునిగిపోబట్టే కల్యాణి విడాకులు తీసుకుందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే వారి విడాకులకు అసలు కారణం ఏంటనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు. కల్యాణి- సూర్య కిరణ్ విడాకులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.