ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీ గా రిలీజైన పుష్ప అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా, ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడు. పుష్ప భారీ విజయం నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. తన మాటలతో డైరెక్టర్ సుకుమార్ ను కూడా ఏడిపించేశారు.
సక్సెస్ మీట్ లో బన్నీ మాట్లాడుతూ.. సుకుమార్ పరిచయం కాకుంటే.. ఆయనతో సినిమా చేయకుండా ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది. నా లైఫ్ ఇంత విజయవంతంగా సాగుతుందంటే అది కేవలం సుకమార్ వ్లే. నా జీవితంలో చాలా తక్కువ మందికి మాత్రమే నేను రుణపడి ఉన్నాను అనే పదం వాడతా. నా తల్లిదండ్రులు.. మా తాత అల్లు రామలింగయ్య.. నాకు అండగా నిలిచిన చిరంజీవి గారికి.. ఆ తరవఆత సుకుమార్ కు. నువ్వు లేకపోతే నేను లేను.. ఆర్య లేదు.. మరేవి లేవు అంటూ బన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే బన్నీ మాటలకు సుకుమార్ కూడా కంట తడి పెట్టాడు.