గత నెలలో ‘సీతారామం’ థియేటర్లో విడుదలైంది. జనాలు ఆ సినిమాకు నీరాజనం పట్టారు. ఇక ఈ మధ్య ఓటీటీలో రిలీజైతే అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్. ముఖ్యంగా సీత పాత్రకు తెలియకుండానే కనెక్ట్ అయిపోయారు. అలా జరగడానికి కారణం.. ఆ పాత్ర చేసిన మృణాల్ ఠాకూర్ నటన. తెలుగులో తొలి చిత్రం చేస్తున్నా సరే ఏ మాత్రం భయం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఈమెని చీరకట్టులో చూసిన ప్రేక్షకులు.. ఈమెని చాలా సాఫ్ట్ అనుకుంటున్నారు. కానీ తాను చాలా బోల్డ్ అని షాకిచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘సీతారామం’ సినిమా ఓ అద్భుతమైన లవ్ స్టోరీ. రామాయణాన్ని రిఫరెన్స్ గా తీసుకుని ఇందులో పాత్రల్ని డిజైన్ చేశారు. ఏదేమైనా మొత్తం క్రెడిట్ మాత్రం రామ్ గా చేసిన దుల్కర్ సల్మాన్, సీతగా చేసిన మృణాల్ ఠాకూర్ కొట్టేశారు. దుల్కర్.. ఇప్పటికే తెలుగులో ‘మహానటి’ చేశాడు. మృణాల్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త. కాబట్టి ఆమె గురించి పెద్దగా తెలీదు. కానీ ఈ మధ్య ఓ షోలో మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేసి ఇప్పుడు ఈమె వార్తల్లో నిలిచింది.
‘నా మనసులు ఏం ఉంటుందో అర్ధం చేసుకున్నవాడే.. నాకు జీవిత భాగస్వామిగా రావాలను కోరుకుంటున్నాను. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరక్కపోతే పెళ్లి చేసుకోను. పెళ్లి కాకపోయినా పిల్లల్ని మాత్రం కనాలని ఉంది. నా అండాన్ని భద్రపరుచుకునిటెస్ట్ ట్యూబ్ ద్వారా అయిన బిడ్డని కని అమ్మ అనిప పిలిపించుకోవాలని ఉంది. ఈ విషయాన్ని మా అమ్మకి చెబితే ఓకే అంది. నా అభిప్రాయాన్ని ఆమె సంతోషంగా స్వాగతించింది’ అని మృణాల్ చెప్పింది. ఈ విషయాన్ని కొందరు పాజిటివ్ గా తీసుకుంటే.. మరికొందరు మాత్రం నెగిటివ్ గా తీసుకుని ట్రోల్ చేస్తున్నారు. మరి మృణాల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఓటీటీలోకి ‘సీతారామం’.. డైరెక్టర్ ఆ లాజిక్ మిస్ అయ్యాడంటున్న నెటిజన్స్!