బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎన్నో కామెడీ షోలు అలరిస్తున్నాయి. అలాంటి వాటిల్లో “శ్రీదేవి డ్రామా కంపెనీ” షో ఒకటి. ఈ షో ద్వారా అనేక మంది నటీనటులు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ షోలో రష్మితో కలిసి హైబర్ ఆది ఓ రేంజ్ లో క్రియేట్ చేస్తున్నారు. ప్రతివారం ఈ షో ద్వారా హైపర్ ఆది తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రతి వారం “శ్రీదేవి డ్రామ కంపెనీ” షో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చి అందరిని అలరిస్తుంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి “ఆషాడం అల్లుళ్లు” పేరుతో ప్రోమో విడుదలైంది. ఇందులో రష్మీని హైబర్ ఆది ఓ రేంజ్ లో కొడతాడు. ఇక ఈ షో కి నటీ పూర్ణ జడ్జీగా వ్యవహరించారు. సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రోమోలో ఆది స్కిట్ లో భాగంగా ఆది భార్యగా గీతాసింగ్ నటించారు. ఆది అందరినీ ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. ఒక టాస్క్ లో భాగంగా ఆది కళ్ళకు గంతులు కట్టుకొని చుట్టూ ఉన్న అత్తలను కొట్టాలి. హైపర్ ఆది కళ్లకు గంతలు కడతారు. అత్తలు ఎక్కడ ఉన్నారని ఆది.. రష్మీని అడుగుతాడు. అత్తలు ఎక్కడో ఉన్నారో.. మీరే వాళ్లను వెతికి వెతికి కొట్టాలని రష్మీ చెప్తుతుంది. కానీ ఆది.. మాత్రం రివర్స్ లో రష్మీని పట్టుకుని పిచ్చ కొట్టాడు కొడతాడు. దీంతో నేను రష్మీనీ అని ఎంత మొత్తుకున్నా వినకుండా హైపర్ ఆది.. రష్మీతో ఓ ఆట ఆటాడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైపర్ ఆది కావాలనే రష్మీని కొట్టాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రష్మీపై హైపర్ ఆదికి ఇంత పగా అంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరి.. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.