సినిమా రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. హీరోయిన్లు స్కిన్ షో, బోల్డ్ సీన్స్ చేయకపోతే షెడ్ కెళ్ళిపోయే పరిస్థితి. అందాలు పొదుపు చేయకుండా విచ్చలవిడిగా పారబోస్తేనే స్టార్ హీరోయిన్లుగా కొనసాగే పరిస్థితి. అలాంటిది ఇండస్ట్రీలో స్కిన్ షో చేయకుండా కూడా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన హీరోయిన్స్ ఉన్నారు, కొనసాగుతున్న హీరోయిన్స్ ఉన్నారు. ఒకప్పుడు సావిత్రి, భానుమతి, కాంచన, కన్నాంబ, అంజలి వంటి హీరోయిన్లు నటనతోనే ఆకట్టుకున్నారు తప్ప బోల్డ్ సీన్స్ లో నటించలేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. వెస్టర్న్ కల్చర్ బాలీవుడ్ కి దిగుమతి చేసుకున్నారు. అక్కడి నుంచి ఆ కల్చర్ దక్షిణాది పరిశ్రమలకి వచ్చేసింది.
బెడ్ సీన్స్, బోల్డ్ సీన్స్ అంటూ సెన్సార్ కి కత్తెర పని బాగా అలవాటు చేశారు. మెల్లగా సెన్సార్ కూడా ఈ ట్రెండ్ కి అలవాటు పడిపోయింది. దీంతో శృతిమించిన బోల్డ్ సీన్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్కిన్ షో ఇంత, బోల్డ్ సీన్స్ లో నటిస్తే ఇంత, బెడ్ సీన్స్ లో చేస్తే ఇంత అని భారీగా రెమ్యునరేషన్లు చెల్లిస్తున్నారు. దీంతో కొంతమంది భారీగా పారితోషికాలు అందుకుంటూ ట్రెండ్ కి తగ్గట్టు ఫ్లోలో వెళ్లిపోతున్నారు. కొంతమంది మాత్రం మేము ఇలానే ఉంటాము, నచ్చితే అవకాశం ఇవ్వండి, లేదంటే లేదు అని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంత డబ్బు ఇచ్చినా నో వే అని తెగేసి చెప్పిన హీరోయిన్స్ ఉన్నారు.
ఇలా వీరంతా కొన్ని సిద్ధాంతాలను పెట్టుకుని ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. సౌందర్య మినహా మిగతా హీరోయిన్లు తాము గీసుకున్న బౌండరీస్ ని ఏరోజూ దాటలేదు. లయ ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉన్నారు. స్నేహ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. పలు టీవీ షోస్ కూడా చేస్తున్నారు. కీర్తి సురేష్, నిత్యామీనన్, సాయి పల్లవి స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.