బుట్టబొమ్మ అంటే చాలు చాలామంది ఆమెని టక్కున గుర్తుపట్టేస్తారు. పేరుకే ముంబై బ్యూటీ కానీ తెలుగులో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి వరస హిట్స్ కొట్టింది. ఒక్కసారిగా తన రేంజ్ పెంచేసుకుంది. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు సినిమాలు ఫెయిలైనప్పటికీ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టింది. ఇదే టైంలో తమిళంలోనూ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. ఈ ఏడాది మాత్రం పూజాకు పెద్దగా కలిసొచ్చినట్లు అనిపించలేదు. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైన ‘రాధేశ్యామ్’ పూర్తిగా నిరాశపరచగా.. బీస్ట్, ఆచార్య కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి! ఈ క్రమంలోనే ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే దానికి కారణం వేరే ఉందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘మాస్క్’ సినిమాతో పూజాహెగ్డే హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ‘ముకుంద’, ‘ఓ లైలా కోసం’ సినిమాలతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ రెండు సినిమాలు పెద్దగా ఆడనప్పటికీ ఈమెకి మాత్రం పేరొచ్చింది. ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథం’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. ఇలా నార్మల్ స్టేజీ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే పూజా తన రెమ్యూనరేషన్ పెంచేసిందనే టాక్ వినిపించింది. తాజాగా ఈ విషయం ఆమె వద్దకు వెళ్లగా, ఇప్పుడు దీనిపై స్పందించింది.
‘రెమ్యూనరేషన్ కోసం నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదు. నేను అసలు పారితోషికం పెంచనేలేదు. అవన్నీ మీడియాలో వస్తున్న రూమర్స్ మాత్రమే. పారితోషికం కోసమే పనిచేయాలంటే.. ఇప్పటికే చాలా సినిమాలకు అడ్వాన్సులు తీసుకుని బిజీగా ఉండేదాన్ని. కానీ నేనేం అంత బిజీగా లేను. మంచి కథల కోసం చూస్తున్నాను. అలాంటి స్టోరీస్ నా దగ్గరకొస్తే డబ్బు విషయమే అస్సలు ఆలోచించను. నిర్మాత ఇచ్చిన ఆఫర్ కే పనిచేస్తాను. నిర్మాతలు అడ్వాన్స్ ఇస్తున్నారు కదా అని తీసి అకౌంట్ లో వేసుకోను. ముందు సినిమాలో పాత్ర, కథ ఎలా ఉందని చూస్తా. ఆ తర్వాత రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తా. కేవలం డబ్బు కోసమే అయితే సినిమా రంగంలోకి వచ్చేదాన్ని కాదు’ అని హీరోయిన్ పూజాహెగ్డే చెప్పింది. ప్రస్తుతం మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా చేస్తోంది. మరి పూజా కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.