గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిన పేరు ‘కాంతార’ రిషబ్ శెట్టి హీరోగా స్వియ నిర్మాణలో తెరకెక్కించాడు ఈ చిత్రాన్ని. కన్నడ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలైన కాంతార.. దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కలెక్షన్ల పరంగా కూడా భారీ వసూళ్లను సాధించింది. కొన్ని కొన్నొచోట్ల కేజీఎఫ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలను దాటి వెళ్లింది. దాంతో ఈ సినిమాలో ఉన్న సాంప్రదాయ నృత్యం అయిన భూత కోల డ్యాన్స్ గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భూత కోల నృత్యానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే! భూత కోల వేడుకల్లో ప్రముఖ హీరోయిన్ అనుష్క పాల్గొన్న వీడియో.
అనుష్క.. టాలీవుడ్ లో ‘సూపర్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి పవర్ ఫుల్ చిత్రాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్లలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే క్రమంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించింది. అదీకాక ఈ అమ్మడు ఈ మధ్యలో కాస్త బరువు పెరి బొద్దుగా కనిపించింది. దాంతో సినిమా అవకాశాలు తగ్గాయనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సినిమాలు పూర్తిగా దూరం అయ్యింది అనుష్క. అప్పటి నుంచి మీడియాలో కూడా కనిపించటం తగ్గించింది జేజమ్మ. కానీ తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha
— PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022
తాజాగా మంగళూర్ లో జరిగిన భూత కోల వేడుకల్లో.. కుటుంబంతో కలిసి పాల్గొన్నారు అనుష్క. సన్నగా మారి, పట్టు చీరలో మెరిసిపోతున్న అనుష్క ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక భూత కోల వేడుకల్లో పాల్గొన్న అనుష్క అక్కడి నృత్యాన్ని తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించుకుంది. ఇక ప్రస్తుతం అనుష్క ఓ చిత్రంలో నటిస్తోంది. అందుకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఆమె బర్త్ డే సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేశారు. దాంట్లో అనుష్క చెఫ్ గా దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పిక్ లో అనుష్క సన్నగా కనిపించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Glimpse of #AnushkaShetty today from her hometown in Mangalore 😍pic.twitter.com/pfUQ92wmtt
— 💫 Anushka Shetty West Bangal Fan club 💞 (@WBAnushkaFC) December 18, 2022