గత కొంత కాలంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి వార్త ఓ సెన్సేషన్ లా మారుతుంది. కొన్నిసార్లు అయితే ఫేక్ న్యూస్ లు దావానంలా వ్యాపిస్తున్నాయి. స్టార్ హూదాలో ఉన్నవారు.. హాస్పిటల్ కి వెళ్తే రక రకాల వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దాంతో అభిమానుల్లో టెన్షన్ మొదలవుతుంది. తమకు ఏ ప్రమాదం లేదని.. ఆ సెలబ్రెటీ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. హీరో విక్రమ్ కి గుండెపోటు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఒంట్లో నలతగా ఉండటంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యిన సంగతి తెలిసిందే. విక్రమ్ కి హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనను వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెగ వార్తలు వచ్చాయి. అంతేకాదు విక్రమ్ పరిస్థితి విషమంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో తమిళ, తెలుగు అభిమానులు ఒక్కసారే షాక్ కి గురయ్యారు. తమ అభిమాన హీరోకి ఏమైందని కంగారు పడ్డారు. తమ అభిమాన హీరో క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఈ వార్తలు అన్నీ పుకార్లు మాత్రమే అని.. ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన కావేరీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యిపోయి ఇంటికి కూడా వెళ్లిపోయారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న విక్రమ్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తనపై ఇంత ప్రేమ అభిమానం చూపించి, తనకు ఎంతో అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలంటూ పేర్కోన్నారు. ఇంతమంది ప్రేమ కనబరచడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని.. ఆ తర్వాత సినిమా షూటింగ్స్‌లో పాల్గొనాలంటూ సూచిస్తున్నారు.
ఇక విక్రమ్ మూవీస్ విషయానికి వస్తే.. తెలుగు ఇండస్ట్రీలో గతంలో చిన్న పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. తెలుగు లో సూర్యపుత్రుడు చిత్రంతో విక్రమ్ తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు. ఆ తర్వాత అపరిచితుడు, ఐ లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. విక్రమ్ ముఖ్య పాత్రలో నటించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ విజువల్ గ్రాండియర్‌గా ఉంది. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#ChiyaanVikram Sir is Discharged for today !♥️🙏🏽
Waiting to see #CobraAudioLaunch pic.twitter.com/oDUPlJmebl
— ChiyaanMathanCvf (@mathanotnmcvf) July 9, 2022
ఇది చదవండి: Dhanush: కెరీర్ లో జరిగిన అవమానాలను గుర్తుచేసుకున్న హీరో ధనుష్..!