ఈ ఫోటోలో స్కూల్ యూనిఫామ్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి, చిన్నప్పుడే డ్యుయల్ రోల్ చేసి ఆశ్చర్యపరిచింది. ఓవైపు చదువుకుంటూనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ ఫోటోలో స్కూల్ యూనిఫామ్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి, చిన్నప్పుడే డ్యుయల్ రోల్ చేసి ఆశ్చర్యపరిచింది. ఓవైపు చదువుకుంటూనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెద్దయ్యాక హీరోయిన్‌గా బిజీ అయిపోయింది. ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఆమె కెరీర్ కాస్త స్లో అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది. ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?.
ఆ చిన్నారి ఎవరంటే.. మలయాళీ భామ నివేదా థామస్. చిన్నప్పుడు తమిళంలో కొన్ని సీరియల్స్ చేసింది. తన మాతృభాషలో బాలనటిగా కూడా నటించి మెప్పించింది. నేచురల్ స్టార్ నాని ‘జెంటిల్‌మెన్’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘నిన్నుకోరి’, ‘జై లవ కుశ’, ‘118’, ‘బ్రోచేవారెవరురా’, ‘వి’ వంటి పలు చిత్రాలతో నటిగా పేరు తెచ్చుకుంది. అలాగే ‘శాకిని డాకిని’ అనే లేడీ ఓరియంటెడ్ ఫిలిం కూడా చేసింది. ‘దర్బార్’ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురిగానూ, ‘వకీల్ సాబ్’ లో పవన్ కళ్యాణ్‌తోనూ చేసింది.
నివేదా స్కూల్ డ్రెస్‌లో ఉంది కదా.. అది బాలనటిగా చేసినప్పటి పిక్. ఈ ఏడాది ‘ఎంతడా సాజి’ అనే మలయాళ మూవీలో మాత్రమే కనిపించింది. ప్రస్తుతం కాస్త రిలాక్స్ మోడ్‌లో ఉన్న నివేదా, తన స్టైలిష్ పిక్స్, రీల్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్, నెటిజన్లకు అప్‌డేట్స్ ఇస్తుంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లో వారితో ముచ్చటిస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 6.8 మిలియన్ల మంది తనను ఫాలో చేస్తున్నారు. ఆకట్టుకునే రూపం, సహజమైన నటన, అందమైన చిరునవ్వు నివేదాకు ప్లస్ పాయింట్. మంచి సినిమాలతో త్వరగా తెరపై కనిపించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.