సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించి నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇళయరాజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొంత కాలంగా ఆయన పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. సంగీత ప్రపంచంలో ఆయనను రారాజుగా పొగిడేవారు. ఆ మద్య ప్రధాని మోదీని భారత రాజ్యంగ నిర్మాతతో పోల్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా ఆయనపై రక రకాలుగా కామెంట్స్ చేశారు. ఇళయ రాజాకు జిఎస్టి చెన్నై శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇళయ రాజా గత కొంత కాలంగా పన్ను విషయంలో ఆలసత్వం వహిస్తున్నారని.. ఆయన రూ.1.8 కోట్ల మేర పన్ను కట్టాలంటూ జీఎస్టీ చెన్నై శాఖ నుంచి మంగళవారం ఇళయరాజాకు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు ఈ మొత్తాకి వడ్డీ, జరిమానా అధనం అని నోటీసులో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే ఈ పన్ను చెల్లింపులకు సంబంధించి ఇళయరాజాకు జీఎస్టీ అధికారులు 3 సార్లు నోటీసులు జారీ చేశారు. కానీ ఆ నోటీసులకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జీఎస్టీ తాజా నోటీసును జారీ చేసింది.
#Breaking | Chennai GST issues notice to Ilaiyaraja: Ask to pay 1.8 crores as tax.
Music maestro praised PM Modi after he was issued a GST summons.
Join the broadcast with @ShivaniGupta_5 pic.twitter.com/gA6GVAe9DB
— News18 (@CNNnews18) April 26, 2022