కోలీవుడ్ ఇండస్ట్రీలో ఐదుగురు టాప్ స్టార్లను బ్యాన్ చేయబోతున్నారని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మిగతా పరిశ్రమలతో పోలిస్తే తమిళనాట పరిస్థితులు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి.
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఐదుగురు టాప్ స్టార్లను బ్యాన్ చేయబోతున్నారని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మిగతా పరిశ్రమలతో పోలిస్తే తమిళనాట పరిస్థితులు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. అక్కడ సినిమా స్టార్లకు, రాజకీయనాయకులకు మధ్య విడదీయలేని సంబంధాలుంటాయి. గతంలో రాజకీయ నాయకుల కారణంగా కొంతమంది నటులను బ్యాన్ చేసిన సంఘటనలు జరిగాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇటీవల కాలంలో నిర్మాతలకు తలనొప్పిగా మారిన ఐదుగురు నటులకు రెడ్ కార్డ్ జారీ చేయాలని సామూహిక నిర్ణయం తీసుకున్నారంటూ విరివిగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయంపై సినీ పెద్దలతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశముందని తెలుస్తుంది.
ఇంతకీ ఆ ఐదుగురు నటులు ఎవరో కాదు. శింబు, విశాల్, ఎస్.జె.సూర్య, అధర్వ, యోగిబాబు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఐదుగురు నటులు సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. తమతో చిత్రాలు చేస్తామంటూ నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకుని డేట్స్ ఇవ్వకుండా నిర్మాతలను నానా ఇబ్బందులు పెడుతున్నారట. ప్రొడ్యూసర్ బాగుంటేనే ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది. అలాంటి నిర్మాతను ఇబ్బంది పెట్టే వారు పరిశ్రమకు అక్కర్లేదంటూ చర్చించి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇక లిస్ట్‌లో ఫస్ట్ పేరు శింబుదే. తనకి వివాదాలేం కొత్త కాదు. ఏ సినిమా చేస్తే ఆ సినిమా నిర్మాత, దర్శకుడిని ఇబ్బంది పెడుతుంటాడని స్ట్రాంగ్ టాక్.
హీరోగా, నిర్మాతగా, గతంలో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశాల్ పేరు కూడా ఉండడం ఆశ్చర్యం. డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్.జె.సూర్య కూడా తన ప్రవర్తన కారణంగా దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడట. ఇక స్టార్ కమెడియన్ యోగిబాబు అయితే స్టార్ హీరోలను మించి యాటిట్యూడ్ చూపిస్తున్నాడట. మరో యువ నటుడు అధర్వ కూడా వీరితో పాటు లిస్ట్‌లో ఉన్నాడు. కాగా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ఐదుగురు నటులను పిలిచి చిన్నపాటి వార్నింగ్ లాంటిది ఇచ్చి, వారు అంగీకరిస్తే ఇండస్ట్రీలో కంటిన్యూ చెయ్యమని చెప్పాలని, కాదు, కూడదు అని ఎదురు సమాధానం చెప్తే బ్యాన్ చెయ్యాలని ఆలోచిస్తున్నారని సమాచారం.