బాలీవుడ్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస హిట్స్ తో దూసుకు వెళ్తున్నారు. ఆ మద్య రజినీకాంత్ నటించిన ‘రోబో 2.0’లో విలన్ గా నటించాడు. అక్షయ్ కుమార్ వ్యక్తిగతం మంచి మనిషి అని పలుమార్లు చాటుకున్నాడు. కరోనా సమయంలో ఎంతో మందికి తన వంతు సాయం అందించారు. అమర జవాన్లకు కోసం పెద్ద ఎత్తున రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. అలాంటి అక్షయ్ కుమార్ పై పంజాబ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ చిత్రం తాజాగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో జోష్ వచ్చింది. సూర్యవంశీ చిత్రం తర్వాత పలు హిందీ చిత్రాలను థియేటర్స్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే.. సూర్యవంశీ చిత్రానికి పంజాబ్ రైతుల సెగ తగిలింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు నిన్న అక్షయ్ కుమార్ సినిమా ‘సూర్యవంశీ’ ప్రదర్శనను అడ్డుకున్నారు.
గత కొంత కాలంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమకు అక్షయ్ కుమార్ మద్దతు ఇవ్వడం లేదని.. రైతు చట్టాలకు మద్దతివ్వకుండా మా ప్రాంతంలో ఆయన సినిమా ఎలా విడుదల చేస్తారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ లోని హోషియార్ పూర్ లో సినిమా ఫ్లెక్సీలు చించేసి నానా హంగామా చేశారు. ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల బయట ఆందోళనకు దిగి సినిమా పోస్టర్లను చించివేశారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు సినిమాను ప్రదర్శించనివ్వబోమని తేల్చి చెప్పారు. ఎవరి సినిమా ప్రదర్శన జరిగినా మేం ఇంతే చేస్తామంటూ రైతులు మండిపడుతున్నారు.