టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘F3’. 2019లో వచ్చిన F2 మూవీకి ఇది సీక్వెల్ గా రూపొందిన సంగతి తెలిసిందే. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అగ్రనిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ తమన్నా, మెహరీన్ లతో పాటు మిగిలిన F2 చిత్రబృందం అంతా మరోసారి సందడి చేశారు. తాజాగా F3 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మరి F2 విజయంతో సీక్వెల్ గా వచ్చిన F3 పై అంచనాలు భారీగానే సెట్ అయ్యాయి. అదీగాక మరో ఇద్దరు హీరోయిన్స్ సోనాల్ చౌహన్, పూజా హెగ్డే స్పెషల్ అప్పీయరెన్సులో కనిపించేసరికి ఆడియెన్స్ అంతా థియేటర్లకు పరుగులు తీసినట్లు తెలుస్తుంది. మొదటి షో నుండే లోగిక్స్ పక్కన పెట్టి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు కలెక్షన్స్ భారీగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో 5 లక్షల డాలర్స్ వసూల్ చేసినట్లు F3 టీం తెలిపింది. అలాగే వెంకటేష్ – వరుణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ జరిగినట్లు సమాచారం.
ఇక తెలుగు రాష్ట్రాలలో F3 డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం – 4.01 కోట్లు
సీడెడ్ – 1.20 కోట్లు
ఉత్తరాంధ్రా – 1.18 కోట్లు
ఈస్ట్ – 72 లక్షలు
వెస్ట్ – 94 లక్షలు
గుంటూరు – 88 లక్షలు
కృష్ణ – 66 లక్షలు
నెల్లూరు – 61.5 లక్షలు
(ఏపీ/టీఎస్) కలిపి – 10.92 కోట్లు (17Cr+ గ్రాస్)
#F3 AP/TS Day1 Collections
Nizam – 4Cr
Ceeded – 1.20Cr
Nellore – 61.50L
Guntur – 87.50L
Krishna – 66L
West – 94L
East – 72L
UA – 1.20CrTotal AP/TS Day1 Share – 10.21Cr
Superb Opening 🔥 #Vekatesh & #VarunTej pic.twitter.com/yyh4l4Qqc7
— Movies Box Office (@MovieBoxoffice5) May 28, 2022