కరోనా మహమ్మారితో ఇండియా రెండేళ్లుగా పోరాడుతోంది. ఎందరో సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీలు, బిగ్ షాట్స్ వరకు వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది కరోనా. ఇటీవల సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం ఎక్కువగా చూస్తున్నాం. టాలీవుడ్ – బాలీవుడ్ చాలామంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ నిర్ధారణ విషయాన్ని స్వయంగా సినీతారలే ప్రకటించడం విశేషం.
తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించాడు దుల్కర్. ఇటీవలే జనవరి 16న దుల్కర్ తండ్రి, మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా సోకినట్లు స్వయంగా ధృవీకరించారు.
ఇక దుల్కర్ సల్మాన్ తన అభిమానులతో కరోనా సోకిన విషయాన్ని షేర్ చేసుకున్నాడు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయని ట్వీట్ లో తెలిపాడు. అలాగే ఇప్పటివరకు తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని కోరాడు. ట్విట్టర్ ద్వారా దుల్కర్.. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. తేలికపాటి ఫ్లూ లక్షణాలు కూడా ఉన్నప్పటికీ బాగానే ఉన్నాను. గత కొన్ని రోజులుగా నాతో పాటు షూటింగ్ లో పాల్గొన్నవారు, నాతో సన్నిహితంగా తిరిగినవారు దయచేసి కోవిడ్ టెస్టులు చేయించుకోండి” అని చెప్పాడు.
Positive. pic.twitter.com/cv3OkQXybs
— Dulquer Salmaan (@dulQuer) January 20, 2022
ఇక సినిమాల విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ చివరిగా థ్రిల్లర్ మూవీ కురుప్‌లో కనిపించాడు. కేరళ మోస్ట్ వాంటెడ్ పరారీలో ఉన్న సుకుమార కురుప్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా, హే సినామిక, సెల్యూట్ సినిమాలు చేస్తున్నాడు.