మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించారు. తెలుగులో దుల్కర్ నటించిన రెండో స్ట్రైట్ మూవీ సీతారామం. ఆగస్ట్ 5న మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఈవెంట్‍లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ బయోపిక్‌కి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీ నాన్న గారు వైఎస్సార్ బయోపిక్‌లో నటించారు.. మీకు వైఎస్ జగన్ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే చేస్తారా?” అని సదరు యాంకర్ అడిగారు.
దానికి దుల్కర్.. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా నటిస్తానని.. అయితే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకూ నటించాల్సి ఉంటుంది, స్క్రిప్ట్ ఎంతవరకూ జనాలకు కనెక్ట్ అవుతుంది, ఇలాంటి విషయాలపై క్లారిటీ వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. కేరళ నుంచి వచ్చాను కాబట్టి, ఇక్కడ రాజకీయాల గురించి తెలియవు కాబట్టి, ఎవరి సైడ్ తీసుకోకుండా ఆలోచిస్తానని మేకర్స్ తనను సంప్రదించే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈయనకి కూడా తెలుగు రాజకీయాల గురించి తెలియదు కాబట్టి మేకర్స్ ఈయనని సంప్రదించి ఉండచ్చు. అందుకే ఇప్పుడు జగన్ బయోపిక్ కోసం తనను కూడా సంప్రదించే అవకాశం ఉందని దుల్కర్ అన్నారు. వైఎస్‌ఆర్ పాత్రకి మమ్ముట్టి న్యాయం చేసినట్టే.. జగన్ బయోపిక్‌లో జగన్ పాత్రకి దుల్కర్ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని జగన్ అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దుల్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.