అప్పట్లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో యువతను బాగా ఆకట్టుకున్న మూవీ ప్రేమదేశం. ఈ చిత్రం ఆ రోజుల్లో సినిమా ప్రేమికులను తెగ ఆకట్టుకుందనే చెప్పాలి. అయితే ఈ మూవీలో హీరోలుగా నటించిన అబ్బాస్, వినీత్ నటన సినిమాకు ప్లస్ గా నిలిచింది. ఇక ఈ మూవీతో హీరో అబ్బాస్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయి ఎనలేని అభిమానులను సంపాదించుకున్నాడు.
అప్పటి నుంచి అబ్బాస్ కు ఆఫర్లు కూడా తన్నుకుంటూ వచ్చాయనే చెప్పాలి. దీంతో కొన్నాళ్లపాటు అబ్బాస్ సినిమాల అవకాశాల విషయంలో వెనుతిరిగి చూసుకోలేదు. ఇక చివరగా 2016 లో ఒక మలయాళం సినిమా చేసి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పాడు అబ్బాస్. అప్పటి నుంచి మళ్ళీ అబ్బాస్ ఏ స్క్రీన్ పై కూడా కనిపించకపోవడం విశేషం.దీంతో ఆయన అభిమానులు అబ్బాస్ ఎటువెళ్లాడు? ఏం చేస్తున్నాడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక సినిమాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టిన అబ్బాస్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో నివసిస్తూ యువతకు దిశానిర్ధేశం చేసే వ్యాఖ్యాతగా జీవిస్తున్నారు. అబ్బాస్ మోటివేషనల్ స్పీకర్ గా పని చేసుకుంటూ ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని ఆ సంక్షోభం నుంచి బయటికి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తుంటానని తెలిపాడు అబ్బాస్.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.