ఇటీవల చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘డీజే టిల్లు’. హీరో సిద్ధు జొన్నలగడ్డ రచించి, నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మాస్ క్లాస్ ప్రేక్షకులను హిలేరియస్ కామెడీతో విశేషంగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులకు మాంచి కిక్కిచ్చింది. ఫస్ట్ డే నుండే అదిరిపోయే కలెక్షన్స్ తో 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసి లాభాలను వెనకేసుకుంది.
విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అయితే.. విడుదలైన నెల రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో డీజే టిల్లు.. త్వరలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆహా వారు అధికారికంగా ప్రకటిస్తూ.. ‘ఇగ టిల్లుగాడి లొల్లి ఆహాలో.. అతి త్వరలో దుమ్ము దులపడానికి వచేస్తున్నాడు. స్క్రాచ్ ఉంటది రెడీగా ఉండండి’ అంటూ స్పెషల్ పోస్ట్ చేశారు.
ఇక మూవీ ప్రసారం ఎప్పుడనేది తెలపలేదు.. కానీ మార్చి 10 నుండి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని టాక్ నడుస్తుంది. మరి అధికారిక తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలలో 8 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జారుకున్న డీజే టిల్లు.. 4 కోట్లకు పైగా లాభాలను ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా.. డీజే టిల్లు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చూడాలి మరి డీజే టిల్లు ఓటిటిలో ఏ విధంగా హంగామా చేస్తాడో.. ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
DJ Tillu dhummu dhulapadaniki vacchesthunnadu. Scratch untadi, ready ga undandi. #ahaLoDJTillu@Siddu_buoy @iamnehashetty @K13Vimal
@MusicThaman @vamsi84 @SricharanPakala
@NavinNooli @SitharaEnts @Fortune4Cinemas @AnindithaMedia #rammiryala pic.twitter.com/zYk6K9G5a7— ahavideoIN (@ahavideoIN) February 25, 2022