పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం.. అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల వరకు ప్రశంసలు అందుకుంటూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మరి ప్రేక్షకులకు ఇంత పెద్ద హిట్ చిత్రాన్ని అందించిన ఆ దర్శకుడు ఎవరంటే.. సాగర్ కె. చంద్ర. పవన్ కళ్యాణ్‌తో “భీమ్లా నాయక్” చేసే వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. అంతగా పరిచయంలేని దర్శకుడిని పవన్ కళ్యాణ్ పిలిచి మరి తన సినిమాను అతని చేతిలో పెట్టారంటే మామూలు విషయం కాదు. ” కేవలం సినిమా రంగంలోనే కాకుండా ఏ రంగంలోనైనా ఎత్తుపల్లాలు ఉంటుంటాయి.ఈ సినిమాకు త్రివిక్రమ్ గారి సహాయం మరువలేనిది. పని చేయడం, నేర్చుకోవడం భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ సమయంలో అనుభవమైంది” అంటూ ఆ సినిమా విశేషాలు డైరెక్టర్ సాగర్ కె.చంద్ర షేర్ చేసుకున్నారు. మరి మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.