సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా ఏదో ఒక సమయంలో తమ లైఫ్ లో జరిగిన చేదు సంఘటనలను కెమెరా ముందు షేర్ చేసుకుంటుంటారు. ఇండస్ట్రీలో ఫేస్ చేసే ప్రాబ్లెమ్స్ పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో కూడా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉంటుంటాయి. అలాగే తన లైఫ్ లో కూడా ఓ యాక్సిడెంట్ ఎక్సపీరియెన్స్ ఉందని చెప్పాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. గుంటూరు టాకీస్, గరుడవేగా సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రవీణ్.. ఇటీవల కమెడియన్ ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ షోలో పాల్గొన్నాడు. కింగ్ నాగార్జునతో తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రవీణ్ ఈ షోకి హాజరయ్యాడు.
ఈ క్రమంలో ది ఘోస్ట్ మూవీ గురించి, హీరో నాగ్, హీరోయిన్ సోనాల్ గురించి మాట్లాడిన తర్వాత హోస్ట్ ఆలీ.. ‘మీ ఫ్రెండ్స్ తో బైక్ లో వెళ్లినప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగిందంట కదా?’ అని అడిగారు. దీంతో ప్రవీణ్ మాట్లాడుతూ.. “నాకు, నాతో పాటు ఇంకో ఫ్రెండ్ కి డ్రైవింగ్ వచ్చు. అయితే.. మేము డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా రాని వేరే అతనికి బైక్ ఇచ్చాము. ట్రక్కు వస్తుంటే దాదాపు ట్రక్కు కిందకు వెళ్లిపోయాడు. అప్పుడు ఓ టైర్ పైనుండి వెళ్లిపోయింది. అది చూసి నేను చాలా భయపడిపోయాను” అంటూ యాక్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇక ప్రవీణ్ రూపొందించిన ‘ది ఘోస్ట్’ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ అవుతోంది.