ప్రస్తుతం 'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్టర్ వెంకటేష్ మహా.. కేజీఎఫ్ 2 గురించి చేసిన కామెంట్స్ భారీ చర్చలకు తెరలేపాయి. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్.. కేజీఎఫ్ పై 'నీచ్ కమిన్ కుత్తే' అంటూ ఘాటు విమర్శలు చేస్తూ.. హేళన చేశాడు. దీతో ఇప్పుడు వెంకటేష్ మాటలు సోషల్ మీడియాలో చర్చలకు దారి తీయగా.. అతనిపై ట్రోల్స్, విమర్శలతో దాడికి దిగారు నెటిజన్స్, మూవీ లవర్స్.
ప్రస్తుతం ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరెక్టర్ వెంకటేష్ మహా.. కేజీఎఫ్ 2 గురించి చేసిన కామెంట్స్ భారీ చర్చలకు తెరలేపాయి. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్.. కేజీఎఫ్ పై ‘నీచ్ కమిన్ కుత్తే’ అంటూ ఘాటు విమర్శలు చేస్తూ.. హేళన చేశాడు. దీతో ఇప్పుడు వెంకటేష్ మాటలు సోషల్ మీడియాలో చర్చలకు దారి తీయగా.. అతనిపై ట్రోల్స్, విమర్శలతో దాడికి దిగారు నెటిజన్స్, మూవీ లవర్స్. ఒక దర్శకుడు మరో దర్శకుడి సినిమాని.. అలాంటి బూతు పదాలతో డీగ్రేడ్ చేయడం ఏంటని..? ఇతను చేసింది బొక్కలో రెండు సినిమాలే కదా! అందులో ఒకటి రీమేక్. చేసిన రెండు సినిమాలకే.. రూ. 1200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాని కామెంట్స్ చేస్తాడా? అతని మాటలు సినిమాలను అవమానించడమే కాదు.. ప్రేక్షకులను కూడా అవమానించే విధంగా ఉన్నాయని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.
ఎవరికైనా సినిమా నచ్చనప్పుడు నచ్చలేదు అని చెప్పడంలో తప్పులేదు. అది కెమెరా ముందైనా, స్ట్రెయిట్ గా ముఖం మీదే అయిన. కానీ.. పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై మాట్లాడుతున్నప్పుడు.. క్రిటిసైజ్ చేసినా పర్లేదు గాని.. అలా విలువలు మర్చిపోయి, బూతులతో రెచ్చిపోవడం కరెక్ట్ కాదనేది నెటిజన్స్ వాదన. నచ్చలేదు అని చెప్పాలనుకుంటే.. పద్ధతిగా చెప్పవచ్చు. నోరుంది అని నోటికొచ్చినంత మాట్లాడితే.. సీరియస్ పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కేజీఎఫ్ ని కామెంట్ చేసినందుకు వెంకటేష్ ఆ విమర్శలనే ఫేస్ చేస్తున్నాడు. పేరు చెప్పకుండా, డైరెక్ట్ గానే ‘KGF 2’ మూవీపై దారుణమైన కామెంట్స్ దీంతో కేజీఎఫ్ మూవీ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్, కామన్ ఆడియెన్స్ వెంకటేష్ మహాపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
ఈ క్రమంలో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ట్రోల్స్ పై ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఎందుకంటే.. వెంకటేష్ కేజీఎఫ్ పై కామెంట్ చేసేటప్పుడు ఆమె అక్కడే ఉండి నవ్వింది. సో.. వెంకటేష్ తో పాటు నందినిని కూడా ట్యాగ్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ నేపథ్యంలో ‘దర్శకుడు వెంకటేష్ చేసిన కామెంట్స్.. ఎవరిని ఉద్దేశించినవి కావు.. ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి. మాస్ కమర్షియల్ సినిమాలు ఆడుతున్నాయంటే.. వాటిల్లో జనాలకు నచ్చే అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. మా చర్చలలో జరిగిన సంభాషణలు ఎవరి కష్టాన్ని ఉద్దేశించినవి కాదు. ఎవరిని తక్కువ చేసేందుకు కాదు. ఆ డిబేట్ జస్ట్ పాజిటివ్ గా సాగింది. నేను ఎందుకు నవ్వానంటే.. వెంకటేష్ వివరించిన వివరించిన విధానానికి నాకు నవ్వొచ్చింది’ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా సరే.. వెంకటేష్ కామెంట్స్ చేశాడు.. కాబట్టి, అతను క్షమాపణలు చెప్పాల్సిందేనని అంటున్నారు నెటిజన్స్. ఈ వివాదం విషయమై నందిని రెడ్డి క్షమాపణలు తెలిపిన ట్వీట్ ని.. జర్నలిస్ట్ ప్రేమ కూడా రీట్వీట్ చేశారు.మరి వెంకటేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. నందిని రెడ్డి వివరణ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Every commercial film which has become a success is bec the audience hs loved something in tht effort . The conversation was nvr meant 2deride anyones work but rathr hv a positive debate on what cn diversify the narrative of “commercial cinema”. Apologies fr any offence caused 🙏🏼
— Nandini Reddy (@nandureddy4u) March 6, 2023
veedu tessina musthi 2 cinemalu intha bulupu ra bsdk?? @mahaisnotanoun https://t.co/A0FTRXCLjF
— ArjunDass (@ARjUNDaass) March 6, 2023