ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు.. ప్రస్తుతం నిర్మాతగా 50 సినిమాలతో టాప్ లో ఉన్నాడు. ఓవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా వేరే సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పుడు స్టార్ హీరోలు రామ్ చరణ్ – శంకర్ లతో ఓ సినిమా, దళపతి విజయ్ తో వారసుడు సినిమాలు నిర్మిస్తున్నాడు. అయితే.. వారసుడు మూవీ ఎప్పుడైతే సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశాడో.. అప్పటినుండి దిల్ రాజు పేరు నిర్మాతగా వివాదాలలో ఎక్కువగా వినిపిస్తోంది.
ఆల్రెడీ సంక్రాంతి తెలుగులో చిరంజీవి నుండి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నుండి వీరసింహారెడ్డి సినిమాలు అనౌన్స్ అయ్యాయి. ఈ రెండూ కూడా స్ట్రయిట్ తెలుగు సినిమాలు. కాగా.. వారసుడు విషయానికి వస్తే.. ఒరిజినల్ తమిళం. తెలుగులోకి డబ్ అవుతోంది. ఈ క్రమంలో సంక్రాంతికి కేవలం స్ట్రయిట్ తెలుగు సినిమాలే రిలీజ్ చేయాలని.. వారసుడు మూవీ విషయంలో దిల్ రాజుకి ఎదురుదెబ్బ పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో దిల్ రాజు.. ఏబిఎన్ రాధాకృష్ణ హోస్ట్ గా నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ అనే ప్రోగ్రాంలో పాల్గొని.. ఈ కాంట్రావర్సీలపై స్పందించాడు.
ఈ క్రమంలో ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ గురించి ప్రాబ్లెమ్ లేదు.. కానీ, షూటింగ్ టైమింగ్స్ లో, నటీనటుల డిసిప్లెన్ విషయంలో రిలాక్సేషన్ వచ్చేసిందని అన్నాడు. అలాగే ఇండస్ట్రీలో క్యారవాన్ కల్చర్ వచ్చాక.. షూటింగ్స్ లో టైం వేస్టేజ్ ఎక్కువ అవుతోందని తెలిపాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా బడ్జెట్ పెరగడానికి క్యారవాన్ కల్చర్ కూడా ఓ రీసన్ అని చెప్పకనే చెప్పేశాడు దిల్ రాజు. యాక్టర్లను పిలవాలంటే ముందు వాళ్ళ అసిస్టెంట్స్ కి చెప్పడం.. వాళ్ళు వెళ్లి యాక్టర్లకు చెప్పడం.. వాళ్ళు రావడానికి 15 నిముషాలు.. ఆ తర్వాత షూటింగ్ ఏరియా సెట్ చేయడానికి ఇంకొంత టైం.. ఇలా దాదాపు చాలా టైం వేస్ట్ అవుతోంది” అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. ప్రస్తుతం అయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి దిల్ రాజు మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.