సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో ఎంతటి వివాదానికి దారి తీసిందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ వీడియోపై డిబెట్ సందర్భంగా.. విశ్వక్ సేన్‌కి, యాంకర్ దేవి నాగవల్లికి మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం గురించి ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. చాలా మంది దేవి నాగవల్లి తీరును తప్పు పడుతున్నారు. గెస్ట్‌గా మీ స్టూడియోకి పిలిచిన వ్యక్తిని ఇలా అవమానించడమేనా జర్నలిజం అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంపై సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై దర్శకుడు హరీష్ శంకర్ ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. యాంకర్ దేవిని ఉద్దేశిస్తూ F..** అనే పదాన్ని ఉపయోగించాడు విశ్వక్ సేన్.. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ వరుస కథనాలు ప్రసారం చేస్తూ విశ్వక్ సేన్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Vishwak Sen Fans: విశ్వక్ సేన్ ను స్టూడియోకి పిలిచి అవమానించారంటూ ఫ్యాన్స్ రచ్చ!
అయితే గతంలో ఇదే యాంకర్ దేవి నాగవల్లి ముందు.. మరో యాంకర్ అనసూయ.. అదే పదం.. F..** దానికి ing కూడా చేర్చుతూ బూతులు మాట్లాడింది. అర్జున్ రెడ్డి సినిమా అప్పుడు అనసూయ మీడియాకి ఎక్కి తెగ హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో అనసూయతో షో చేసింది యాంకర్ దేవి. ఆమె ముందు మాట్లాడిన అనసూయ F..**ing అంటూ బూతులు మాట్లాడింది. అప్పుడు మాత్రం ఎదురుగా ఉన్న యాంకర్ దేవికి అది బూతులా అనిపించకపోగా.. ఆ బూతు మాట్లాడిన అనసూయలో ఫైటర్ కనిపిస్తున్నారంటూ తెగ పొంగిపోయింది.
ఇది కూడా చదవండి: Devi nagavalli: దేవి నాగవల్లి పడ్డ ఆ కష్టాల గురించి మీకు తెలుసా?
ఈ క్రమంలో ప్రశ్న అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అరెరే.. భలే దొరికిందే ఈ వీడియో.. దేవి snake వల్లి అక్కకి ఈ పదం ఇప్పుడు బ్రహ్మానందంగారి కామెడీ సీన్‌లా అనిపించి అక్కలో హాస్య గ్రంధులు విచ్చుకునట్టు ఉన్నాయి. అందుకే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంది.. మళ్లీ అక్కకి ఇక్కడ ఫైటర్ అనసూయ కనిపించింది. అంతేనా అక్కా ??’’ అంటూ ఫేస్‌బుక్‌పేజ్‌లో పోస్ట్ పెట్టగా.. దాన్ని షేర్ చేస్తూ స్మైల్ ఎమోజీలను షేర్ చేశారు హరీష్ శంకర్. అంతేకాక ఈ వివాదంపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లును సైతం షేర్ చేశారు హరీష్ శంకర్. ప్రస్తుంత అవి తెగ వైరలవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.