ఇటీవలి కాలంలో తెలుగు టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో.. బిగ్ బాస్. దాదాపు 15 సీజన్లుగా బిగ్ బాస్ హిందీ ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ తెలుగులో మాత్రమే 5 సీజన్స్ నుండి అన్ని భాషల్లో కంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది బిగ్ బాస్. అయితే.. బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు నుండే బిగ్ బాస్ OTT వెర్షన్ పై ఫ్యాన్స్ లో అంచనాలు మొదలయ్యాయి.
టీవీ ప్రేక్షకుల వరకే పరిమితమైన ‘బిగ్ బాస్ షో’ని ఓటిటి వెర్షన్ లో 24 గంటలు ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటిటి వెర్షన్ కి సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా జరుగుతోంది. బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనేవారు వీరేనంటూ కొందరి పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ టీవీ షోని గత మూడు సీజన్స్ నుండి అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్నారు. 6వ సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే.. టీవీ వెర్షన్ కి నాగ్ ఉన్నారు ఓకే. మరి OTT వెర్షన్ కి హోస్ట్ ఎవరు? అనే టాపిక్ పై నెట్టింట ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ కి హోస్టుగా ‘సీజన్ 5’ కంటెస్టెంట్ RJ కాజల్ పేరు వినిపిస్తోంది. మరి ఇందులోఎంతమేరకు నిజముంది అనేది బిగ్ బాస్ యాజమాన్యం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ఫిబ్రవరి చివరి వారం నుండి ప్రారంభం కానుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రోమోలు కూడా రెడీ చేస్తున్నట్లు టాక్. ఇక బిగ్ బాస్ ఓటీటీ షో.. 82 రోజులపాటు 24 గంటలూ డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం కాబోతుంది. మరి బిగ్ బాస్ తెలుగు ఓటిటి హోస్ట్ ఎవరనే అంశం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.