గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొంతమంది సీనియర్ నటులులు, అలాగే ఇంకా కొన్ని విభాగాలకు చెందిన టెక్నీషియన్లు,నిర్మాతలు,నటులు వంటి వారు కన్నుమూసిన సంగతి తెలిసిందే. హీరోలు, హీరోయిన్ల కుటుంబంలో కూడా మరణ వార్తలు ఎక్కువగా వినిపించాయి.
ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఇటీవల పలువురు సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు రఘు ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు. ప్రముఖ హాస్యనటుడు రఘు కారుమంచి తండ్రి వెంకట్రావు కారుమంచి ఈరోజు కన్నుమూశారు.
గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూన్ 10, 1947లో జన్మించిన వెంకట్రావ్ ఆర్మీ అధికారిగా సేవలదించారు. వెంకట్రావ్ మృతి పట్ల రఘు కి సంబంధించిన బంధుమిత్రులు, స్నేహితులు సంతాపం ప్రకటించారు. ఇక రఘు కారుమంచి 150కి పైగా సినిమాల్లో నటించారు. వెండితెరపై రఘ డైలాగులు మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.