ఈ మద్య కొంతమంది కామాంధులు చిత్తుగా మద్యం సేవించి చిన్నా పెద్దా అనే వయసు తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతినిత్యం ఎక్కడో అక్కడ జరుగుతునే ఉన్నాయి.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కామంంధుల్లో మాత్రం మార్పురావడం లేదు.
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు అమలు చేస్తున్నా కామంధుల్లో మార్పురావడం లేదు. తాజాగా ఓ సినీ నటుడు తనపై అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సినీ ఇండస్ట్రీలో తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ కమెడియన్ ఖయాలీ సహారన్ పై అత్యాచార కేసు నమోదు అయ్యింది. రాజస్థాన్.. జైపూర్ లో ఓ యువతి కమెడిన్ ఖయాలీ సహారన్ తనపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు తమకు ఉద్యోగం కావాలని కమెడియన్ ఖయాలీ సహారన్ వద్దకు వెళ్లారు. తప్పకుండా ఉద్యోగ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు ఖయాలీ. ఉద్యోగం గురించి మాట్లాడాలని సర్టిఫికెట్స్ తీసుకొని తాను చెప్పిన హూటల్ కి రావాల్సిందిగా యువతులకు ఫోన్ చేశాడు.
ఇద్దరు యువతులు సర్టిఫికెట్స్ తీసుకొని ఖయాలీ సహరన్ చెప్పిన హూటల్ కి వెళ్లారు. అప్పటికీ వక్రబుద్దితో ఉన్న సహరన్ హూటల్ లో రెండు గదులు బుక్ చేశాడు. ఇద్దరు యువతులకు ఓ గది ఇచ్చి తాను మరో గది తీసుకున్నాడు. ఇక వారితో మాట్లాడాలని చెప్పి గదిలోకి మద్యం తీసుకు వెళ్లాడు. అప్పటికే ఖయాలీ సహరన్ చిత్తుగా మద్యం సేవించాడు. తాను మద్యం సేవించడమే కాదు.. ఆ యువతులను కూడా తాగాలని బలవంతం చేశాడు. దీంతో భయాందోళనకు గురనై ఓ యువతి అక్కడ నుంచి పారిపోయింది.. మరో యువతిపై ఖ్యాలీ బలవంతంగా అత్యాచారం చేశాడు. ఎలాగో అలా తప్పించుకొని వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖయాలీ సహారన్ ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక కార్యకర్తగా కొనసాగుతున్నాడు.
ఈ సందర్భంగా మానసరోవర్ పోలీస్ స్టేషన్ ఎస్సై మాట్లాడుతూ.. ‘ఓ యువతి మంగళవారం తనకు ఉద్యోగం ఇస్తానన్న నెపంతో కమెడియన్ ఖయాలీ సహారన్ అత్యాచారానికి పాల్పపడినట్టు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అతను చిత్తుగా తాగి విచక్షణారహితంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమెడియన్ ఖయాలీ పై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) కింద కేసు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.