జానీ మాస్టర్.. అంటే కొరియో గ్రాఫర్ గా సౌత్ ఇండియా సినీ ప్రియులందరికి పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన కొరియోగ్రాఫితో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలో అందరి హీరోల సాంగ్స్ కి అద్భుతమైన కొరియోగ్రఫి చేస్తున్నాడు. ఇటీవల దళపతి విజయ్ నటించిన “బీస్ట్” సినిమాలో “అరబిక్ కుతు” సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రాఫి చేశారు. ఆ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా తాను కొరియోగ్రఫీ చేస్తున్న సాంగ్స్ గురించి జానీ మాస్టర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో స్టార్ హీరో హీరోయిన్ల చేత బ్యూటిఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ వేయించి తక్కువ టైంలోనే మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్‌గా మారిపోయారు జానీ మాస్టర్. ప్రస్తుతం రాం చరణ్, విజయ్ సినిమాలకు జానీ మాస్టర్ కొరియో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జానీ మాస్టర్ మాట్లాడుతూ..”విజయ సార్ నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించి రాంచరణ్ సాంగ్ ఉండబోతుంది. మీరు కచ్చితంగా ఆ సాంగ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు” అని అన్నాడు. ప్రస్తుతం జానీ మాస్టర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. జానీ మాస్టర్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.