బాలీవుడ్ లో బిగ్ బాస్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత ఇండస్ట్రీలో స్టార్లుగా మారిన వారు ఉన్నారు. కొంతమంది టెలివిజన్ సీరియల్స్ లో బిజీ అయ్యారు. బిగ్ బాస్ ఓటీటీలో ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా నిలిచి ఫేమస్ అయిన ఉర్ఫీ జావేద్ అంటే తెలియనివారు ఉండరు. తన ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఈమె వస్త్రాలంకరణపై ఎన్నో ట్రోలింగ్స్ వస్తుంటాయి. ఉర్ఫీ జావేద్ పై న్యూ ఢిల్లీలో కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల సోషల్ మీడియాలో ఉర్ఫీ జావెద్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నిలిచే ఉర్ఫీ జావెద్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె నటించిన ఓ ప్రైవేట్ ఆల్భామ్ సాంగ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉర్ఫీ జావెద్ నటించిన ‘యే మజ్బూరి’ అనే అల్భమ్ సాంగ్ అక్టోబర్ 11న రిలీజ్ అయ్యింది. ఈ వీడియోలో రెడ్ శారీలో డ్యాన్స్ చేస్తూ.. గ్లామర్ షో చేసింది. దీంతో ఉర్ఫీ ధరించిన చీర.. ఆమె తీరుపై దేశ వ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సాంగ్ లో ఆమె డ్యాన్స్ తీరు లైంగిక పరంగా రెచ్చగొట్టే విధంగా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.
గతంలో సోషల్ మీడియాలో ఉర్ఫీ జావెద్ పై ఎన్నో అభ్యంతరాలు.. నెగిటివిటీ వచ్చిన విషయం తెలిసిందే.. ఇలాంటి నెగిటివిటీ తనను ఏ మాత్రం బాధించబోవని ఉర్ఫీ జావెద్ పలు మార్లు అన్న విషయం తెలిసిందే. తాజాగా వివాదం పై స్పందించిన ఆమె ‘నేను నా డ్రెస్సింగ్ స్టైల్ పట్ల గర్విస్తున్నాను.. నా పై ట్రోల్స్ చేసేవాళ్ల గురించి అస్సలు పట్టించుకోను.. నన్ను ఎంతో మంది అభిమానించేవారు ఉన్నారు.. వివాదాలు నన్ను ఏమీ చేయలేవు.. ఎందుకంటే నేను ఏం చేసినా కొంత మందికి అస్సలు నచ్చదు.. దాన్ని పెద్ద సమస్యగా మారుస్తుంటారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె నటించిన వీడియో ఆల్భామ్ పై పలు కామెంట్స్ వస్తున్నాయి.