Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులు తిరగరాసింది. విడుదలైన అన్నిచోట్ల భారీ వసూలు సాధించింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ఇతర భాషల్లో ఆకట్టుకున్న చిత్రంగా ‘పుష్ప’ నిలించింది. సుకుమార్ డైరెక్షన్, బన్నీ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
దేశవ్యాప్తంగా పుష్పకు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పుష్ప 2ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు దర్శకుడు సుకుమార్. మొదటి భాగాన్ని మించిన ఎలివేషన్స్‌తో రెండవ భాగాన్ని తీయాలన్న గట్టి నిర్ణయంతో ఉన్నారు. కొత్త కొత్త పాత్రల్ని కూడా రంగంలోకి దించుతున్నారు. ముఖ్యంగా స్క్రిప్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్‌ను సిద్దం చేసే విషయంలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన, సుకుమార్‌కు సహాయపడుతున్నట్లు సమాచారం.
ఈ ఇద్దరూ కలిసి పుష్ప 2 కోసం మేథోమథనం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్, బుచ్చిబాబు కలిసి ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ గురుశిష్యులు కలిసి పుష్ప 2 కథను ఎలా తీర్చిదిద్దబోతున్నారో తెరపై చూడాల్సిందే. పుష్ప 2 స్క్రిప్ట్ పనులు పూర్తవగానే సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్ మొదలవ్వనుందని సమాచారం. మరి, పుష్ప 2 కోసం సుకుమార్, బుచ్చిబాబు కలిసి మేథోమథనం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Buchibabu joins #PushpaTheRule Script work, most likely to hit sets on September #AlluArjun #Sukumar #Rashmika pic.twitter.com/TrzbIe50Kw
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) July 27, 2022
ఇవి కూడా చదవండి : మతాన్ని మార్చుకున్న సినీతారలు ఎవరో తెలుసా?