ఓ సినిమాలో డైలాగ్ లో అన్నట్టు టాలెంట్ ఎవరి సొత్తూ కాదు అన్నట్టు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం వచ్చింది. దీంతో ఎంతో మంది సింగింగ్, డ్యాన్స్, పర్ఫామెన్స్ తో సోషల్ మాద్యమాల్లో అదరగొడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో సెలబ్రెటీలుగా మారుతున్నారు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. కొంతమంది అదృష్టం కొద్ది మంచి ఫేమస్ కూడా అవుతున్నారు. గతంలో ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాచేవారు.. కానీ ఇప్పుడు యూట్యూబ్, ఇన్ స్ట్రా, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా తమలో ఉన్న టాలెంట్ కోట్లమందికి చూపిస్తున్నారు. అదృష్టం కలిసి వచ్చి అనూహ్యంగా ఫేమస్ అవుతున్నారు. ఆ మద్య గల్లీలలో సైకిల్ మీద పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ ‘కచ్చా బాదాం’ సాంగ్ తో ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
సోషల్ మీడియా వేధికగా ఈ మద్య చాలా మంది కళాకారులు తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సెలబ్రెటీల కంట పడటంతో వారిని వెలుగులోకి తీసుకు వస్తున్నారు. కొంత మంది ఒక్క వీడియోతో వైరల్ అవుతూ తక్కువ సమయంలో సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. పాత సామాన్లు ఇచ్చి.. పచ్చి పల్లీలు తీసుకుంటూ గల్లీల్లో తిరుగుతూ కచ్చా బాదాం అనే సాంగ్ పాడిన భుబన్ బద్యాకర్ ఏక్ తారా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చి ఎంతో ఫేమస్ అయ్యాడు. ఒక్క పాటతో ప్రపంచ వ్యాప్తంగా ఇతని సాంగ్ ఫేమస్ అయ్యింది.
తాజాగా బీహార్ కి చెందిన అమర్జిత్ జయకర్ అనే యువకుడు 2004 లో సూపర్ హిట్ అయిన మస్తీ మూవీలోని ‘దిల్ దే దియా’ అనే సాంగ్ ని అద్భుతంగా పాడి అందరి మనసు దోచాడు. బీహార్ లోని సమస్తపూర్ కి చెందిన అమర్జిత్ జయకర్ తన ఊరిలో పొలం వద్ద ఉదయం బ్రెష్ వేసుకొని సెల్ఫీ తీసుకుంటూ మనసు పెట్టి ‘దిల్ దే దియా’ పాట పాడాడు. ఆ పాటను అమర్జిత్ ఎంతో ప్రొఫెషనల్ సింగర్ గా ఆలపించాడు. ఈ వీడియో చూసిన చాలా మంది మట్టిలో మాణిక్యం అంటే ఇతడే.. ఎంత అద్భుతంగా పాడాడు అంటూ ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరో టాలెంట్ ఉన్న సింగర్ లైన్ లోకి వచ్చాడు.. అతన్ని వెలుగులోకి తీసుకు రండి అంటూ పలువురు సెలబ్రెటీలు ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నటి నీతూ చంద్ర శ్రీవాస్తవ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ‘ఆహా అద్భుతంగా పాడాడు.. ఎవరీ అబ్బాయి.. నాకు కాంటాక్ట్ నెంబర్ కావాలి’ అంటూ పేర్కొన్నారు. దాంతో ఎవరీ అమర్జీత్ అంటూ నెటిజన్లు ఆరాతీసే పనిలో ఉన్నారు. ఇలాంటి టాలెంట్ ఉన్న యుత్ ని ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్లు వెలుగు లోకి తీసుకు రావాలని నెటిన్లు కోరుకుంటున్నారు.
Who is this guy ? Fabulous. Please send his contact no.
Thanks https://t.co/eMbPy8n38b— Nitu Chandra Srivastava (@nituchandra) February 21, 2023