తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూనే ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. సీజన్ సీజన్‌కు సరికొత్త టాస్కులు.. ఊహించని సంఘటనలు.. ఆసక్తిని కలిగించే ఎలిమినేషన్స్ తో మజాను పంచుతూ.. తెలుగులో ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. మాటీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ మాదిరిగానే ఇక్కడ కూడా ఊహించని ఎలిమినేషన్స్ చేస్తూ.. ప్రేక్షకులను ఓ రకంగా చెప్పాలంటే షాక్‌కు గురి చేస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే ఐదో వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలిసింది. ఆ వివరాలు..
ప్రతి ఆదివారం నాగార్జున హౌస్ లోపలికి వచ్చి ఒక హౌస్ సభ్యుడుని ఎలిమినేట్ చేస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలుగురు సభ్యులు అలాగే ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎప్పటిలాగే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయం ముందు రోజే లీక్ అయింది. ఇక ఐదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ టాస్క్ ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. అయితే, మధ్యలో స్వైప్ చేసే టాస్కును కూడా ఇచ్చారు. దీంతో అషు, మహేశ్ విట్టా దీని నుంచి సేఫ్ అయ్యారు. ఇక చివరికి ఇందులో బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, స్రవంతి చోకారపు, తేజస్వీ మదివాడ, అనిల్ రాథోడ్‌లు నామినేషన్‌లో మిగిలిపోయారు.
ఇది కూడా చదవండి: అఖిల్ కెప్టెన్ కావడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. అదీ ఒక గెలుపేనా?ఐదోవారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇందులో బిందుమాధవి అన్ అఫీషియల్ పోలింగ్స్ లో టాప్ లో ఉంటే, తేజస్వి సేఫ్ జోన్ లోనే ఉంది. తేజస్వి కంటే కూడా అనిల్ రాధోడ్, మిత్రా శర్మా, ఇంకా స్రవంతిలు వెనకబడి ఉన్నారు. కానీ, బిగ్ బాస్ టీమ్ అనూహ్యంగా తేజుని ఎలిమినేట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజానికి హాట్ స్టార్ లో ఓటింగ్ అనేది ఎలా జరుగుతుందో ఆడియన్స్ కి చూపించరు.అంతేకాదు, ఇప్పుడు తేజస్వి ఎలిమినేషన్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని ఖండిస్తున్నారు బిగ్ బాస్ లవర్స్. నిజానికి సీజన్ 2 తో పోలిస్తే తేజస్వి గేమ్ బాగా డెవలప్ అయ్యింది. అందరితో కలిసిపోతూ.. చాలా సెటిల్డ్ గా గేమ్ ఆడుతోంది. అయితే, నటరాజ్ మాస్టర్ తో ఉన్న గొడవ వల్ల ఈసారి నామినేషన్స్ లోకి వచ్చింది. అందుకే ఎలిమినేట్ అయ్యింది. నిజానికి తేజుని కేవలం మాస్టర్ మాత్రమే నామినేట్ చేశారు.
ఇది కూడా చదవండి: బిందు మాధవిపై సీనియర్లు సీరియస్! గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నారు?
నామినేషన్ లిస్ట్‌లో ఉన్న వారిలో అనిల్ రాధోడ్, మిత్రా శర్మా, ఇంకా స్రవంతిలు వెనకబడి ఉన్నా.. తేజస్వి ఎలిమినేట్ కావడం ఏంటో అర్థం కాక జనాలు జుట్టు పట్టుకుంటున్నారు. దీని వెనక కారణాలు కేవలం బిగ్ బాస్‌కే తెలుస్తాయి అని కామెంట్ చేస్తున్నారు. తేజస్విని ఎలిమినేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: అఖిల్ కి అషు భార్యలా ఉంటోంది: సరయు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.