ఈ మధ్యకాలంలో సినీ నటులు హోమ్ టూర్ అంటూ తమ ఇళ్లను చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినీ తారలతో పాటు సీరియల్ నటులు, మరికొందరు సెలబ్రిటీలు సైతం హోమ్ టూర్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, RJ కాజల్.. హోమ్ టూర్ వీడియో రిలీజ్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఆర్జే కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె మాటల ప్రవాహానికి అడ్డుకట్ట ఉండదు. ఆ మాటలతోనే అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ షో ద్వారా కాజల్ మంచి గుర్తింపు సంపాందించింది. ఆ షో అనంతరం పలు కార్యక్రామలతో నిత్యం బిజీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇల్లును చూపిస్తూ హోమ్ టూర్ వీడియో చేసింది. ఈ హోమ్ టూర్ చేయడానికి గల బలమైన ఓ కారణం కూడా ఈ సందర్భంగా కాజల్ తెలిపింది.
అప్పుడే వచ్చేశారా? ఇంకా ఇల్లు సర్దలేదంటూనే.. తన గృహాన్ని చూపించింది. అనివార్య కారణాల వల్ల త్వరలోనే ఈ ఇంటిని వదిలేసి కొత్తింటికి మారిపోతున్నామని.. అందుకే హోం టూర్ వీడియో చేశానని చెప్పుకొచ్చింది. ఇంట్లో అడుగుపెట్టగానే మొదటగా స్కూల్ నుంచి కాలేజీ వరకు గెలుచుకున్న బహుమతులను చూపించింది కాజల్. వరుసగా అమర్చిన పుస్తకాలను చూపిస్తూ ఫరియా అబ్దుల్లా తనకో పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిందని చెప్పింది. హాల్, కిచెన్, పూజా గది, గెస్ట్ రూమ్, బాల్కనీతో పాటు తన సోదరి గదిని చూపించింది. ఇలా ఇళ్లు అంతా చూపిస్తూ కాజల్ తెగ సందడి చేసింది. మరి..ఆర్జే కాజల్ హోమ్ టూర్ వీడియోపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి శంకర్ బోల్డ్ ఫొటోస్ వైరల్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.