నటసింహం నందమూరి బాలకృష్ణ చాలాకాలం తర్వాత అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా.. బాలయ్యని మళ్లీ ఫేమ్ లోకి తీసుకొచ్చిందనే చెప్పాలి. భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇటీవలే 50రోజులు పూర్తి చేసుకుంది. అలాగే బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా అఖండ నిలిచింది.
ప్రస్తుత కరోనా పరిస్థితిలో హై బడ్జెట్ అనేది రిస్క్ తో కూడుకున్నదే. కానీ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి రిస్క్ చేసి అఖండ సినిమాకి 60 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది. అదీగాక కరోనా బ్రేక్ తర్వాత సినిమా రిలీజ్ అయ్యేసరికి పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా..? అసలు జనాలు సినిమా చూసేందుకు థియేటర్లకి వస్తారా? అనే సందేహాలతో టెన్షన్ పడ్డాడు.తీరా చూస్తే.. ఎవరూ ఊహించని విధంగా అఖండ అఖండమైన విజయం అందుకుని అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో బాలయ్యతో తదుపరి సినిమాలు చేయబోయే దర్శకనిర్మాతలకు బడ్జెట్ పరంగా ధైర్యం వచ్చింది. అందుకే బాలయ్యతో సినిమా నిర్మించనున్న మైత్రి మూవీస్ వారు పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టేందుకు రెడీ అయినట్లు ఇండస్ట్రీ టాక్.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్న ఈ సినిమాని డైరెక్టర్ గోపీచంద్ మలినేని భారీ ప్రాజెక్ట్ గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు మైత్రి మూవీస్ నిర్మాణం కాబట్టి బడ్జెట్ పరంగా ఎక్కడా లోటుపాట్లు ఉండవని సమాచారం. అఖండతో బాలయ్య మార్కెట్ కూడా పెరిగింది. అంతేగాక బాలయ్య సినిమాల్లో మేజర్ గా భారీ యాక్షన్ ఘట్టాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటేనే క్లిక్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే క్రాక్, అఖండ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్లనే డైరెక్టర్ ఎంపిక చేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ కాగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి బాలయ్య తదుపరి సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.