సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు చాలా మంది హీరోలు రకరకాల రంగాల్లో పనిచేసేవారు. అలా చాలీ చాలని జీతాలకు పనిచేస్తునే.. తమ ఫ్యాషన్ ను మాత్రం కొనసాగిస్తూనే ఉండేవారు. ఎన్నో కష్టాలను ఓర్చుకుని, కడుపు మాడ్చుకుని ఇండస్ట్రీకి వచ్చానని.. తాను పడ్డ కష్టాల గూర్చి చెప్పుకొచ్చాడు ఆల్ ఇండియా సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. చాలీ చాలని శాలరీలు, ఒకే రూమ్ లో ఏడుగురు ఉండటం, డబ్బులు లేక పస్తులు ఉండటం లాంటి విషయాలను పంచుకున్నారు బిగ్ బి. ఈ క్రమంలోనే తన చివరి జీతానికి సంబంధించిన స్లిప్ ను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాన్నని గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నాడు సూపర్ స్టార్. ఇంతకీ బిగ్ బి చివరి సారిగా తీసుకున్న శాలరీ ఎంతనుకుంటున్నారు? తెలిస్తే మీరు నోరెళ్ల బెట్టడం ఖాయం.
అమితాబ్ బచ్చన్.. భారతీయ సినీ పరిశ్రమలో ఓ నట శిఖరం. గత 50 సంవత్సరాలుగా అలుపెరగని పోరాట యోధుడిగా సినిమాలు చేస్తూ.. అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. వయసు మీదపడుతున్నా గానీ తనలో ఉన్న ఆ నటనను మాత్రం వదలడం లేదు. కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తు వారికి సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలోనే తన సినీ జీవితంలో ఎదుర్కొన చేదు అనుభవాలతో పాటుగా తాను పని చేసిన కంపెనీ నుంచి తీసుకున్న చివరి శాలరీ స్లిప్ ను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారట బిగ్ బి సాబ్.
”అది 1968 అప్పట్లో నేను కోల్ కత్తాలో ఉండే వాడిని. నా ఏడుగురు ఫ్రెండ్స్ తో కలిసి అతిచిన్న రూమ్ లో ఉండేవాళ్లం. సాయంత్రం సరదాగా అక్కడ ఉండే రిచ్ రెస్టారెంట్ల దగ్గరకి వెళ్లే వాళ్లం. ఎప్పటికైనా ఇలాంటి హోటల్స్ లో ఫుడ్ తింటాం అని కలలు మాత్రం కనేవాడిని” అని బిగ్ బి తన బ్లాగ్ లో చెప్పుకొచ్చాడు. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు బిగ్ బి కోల్ కత్తాలోని బ్లాకర్స్ అనే కంపెనీలో వర్క్ చేసేవారట. అప్పట్లోనే బిగ్ బికి నెలకు రూ. 1640 రూపాయలు జీతంగా ఇచ్చేవారని, ఇప్పటికీ 1968 నవంబర్ 30 నేను తీసుకున్న చివరి జీతానికి సంబంధించిన స్లిప్ భద్రంగా ఉందని బిగ్ బి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ కోల్ కత్తా వెళ్లినప్పుడు తన స్నేహితులను కలిసి వస్తుంటానని బిగ్ బి అన్నారు.