KGF అనగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ ల పేర్లే ముందుగా గుర్తొస్తాయి. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణిల పేర్లు గుర్తొస్తాయి. అయితే.. వీరంతా కలిసి తక్కువ బడ్జెట్ లో కేజీఎఫ్-2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ పేరు మార్మోగిపోయే రేంజిలో విజయాన్ని నమోదు చేశారు. ఈ సినిమా విజయంలో మేజర్ పార్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కే దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే.. ప్రశాంత్ తన ఫస్ట్ సినిమా నుండి ప్రతి సినిమాకు ఎవరో ఒకరు టెక్నీషియన్ కి లైఫ్ ఇస్తూనే ఉన్నాడు.
అలా ప్రశాంత్ నీల్ చేత గుర్తించబడి లైఫ్ పొందిన వారిలో ఒకరు సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ. ఒక ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన భువన్.. ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పనిచేయకుండా సినిమాల్లోకి స్టిల్ ఫోటోగ్రాఫర్ గా వచ్చాడు. ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫస్ట్ సినిమా ‘ఉగ్రమ్’కి స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసే సమయంలో సినిమాటోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చి.. భువన్ ని డీవోపీ చేసాడు. ప్రస్తుతం ప్రపంచం అంతా కొనియాడుతున్న భువన్ గౌడ.. తనకు వర్క్ నేర్పించి ఈ స్థాయికి తీసుకొచ్చింది.. తన లైఫ్ మార్చింది ప్రశాంత్ యేనని చెప్పాడు. ప్రస్తుతం భువన్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి డీవోపీ భువన్ గౌడ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.