ఇటీవల స్టార్ హీరో, హీరోయిన్ల కూతుళ్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు స్టార్ నటుల వారసురాళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది మందిమాత్రమే సక్సెస్ అందుకున్నారు. తెలుగులో అలనాటి అందాల తార, బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ కూతురు అవంతిక దుస్సాని ‘నేను స్టూడెంట్ సార్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన మేనే ప్యార్ కియా చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ అతి తక్కువ చిత్రాల్లో నటించింది. మైనే ప్యార్ కియా చిత్రం తెలుగు లో ప్రేమపావురాలు గా రిలీజ్ అయ్యింది. తర్వాత బాలకృష్ణ నటించిన యువరత్నరాణా లో నటించింది. ఇటీవల రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ తల్లిగా కనిపించారు భాగ్యశ్రీ. చాలా కాలం ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా భాగ్యశ్రీ కూతురు అవంతిక దుస్సాని హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడైన రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా సతీష్ వర్మ నిర్మిస్తున్న ‘నేను స్టూడెంట్ సార్’ చిత్రం ద్వారా అవంతిక దుస్సాని హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్ర కథ అందించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో బెల్లంకొండ గణేష్ చుట్టూ గన్స్ పెట్టి ఉండగా చేతిలో ఐడీ కార్డు పట్టుకన్నట్లు కనిపిస్తున్నాడు. తాజాగా అవంతిక దుస్సాని కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో కాలేజ్ స్టూడెంట్ గా చాలా స్టైలిష్ లుక్ తో కనిపిస్తుంది అవంతిక దుస్సాని.
‘నేను స్టూడెంట్ సార్’చిత్రంలో సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్, సముద్రఖని కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇది చదవండి : ‘గాడ్ ఫాదర్’ మూవీ చూసిన సూపర్ స్టార్ రజినీ! ఏమన్నారంటే..