టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అసహనం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ రేట్లు పెంచమని అడిగిన వాళ్లే.. ఇప్పుడు తగ్గించమని అడుగుతున్నారని.. హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్లే.. సినిమా టికెట్ ధరలు పెంచారనేది వాస్తవం కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వివాదంపై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. తాను ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక ప్రొడ్యూసర్ గిల్డ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏ హీరోను.. డైరెక్టర్‌ను పారితోషికం తగ్గించుకోమని చెప్పే అర్హత నిర్మాతకు లేదు.. అలా అడగకూడదు. కార్లలో రకరకాలు ఉంటాయి.. అన్ని కార్లే అయినా ఒక్కో కారుకు ఓ రేటు ఉన్నట్లే.. అందరూ హీరోలే అయినా ఒక్కో హీరోకు ఒక రేటు ఉంటుంది. అది మనకు నచ్చి.. మనం ఎంత మార్కెట్ చేసుకోవాలో తెలిసినప్పుడు హీరోను అప్రోచ్ అయి సినిమా తీయాలి. అంతేగానీ హీరోల రెమ్యునరేషన్ తగ్గించాలనేది తప్పు వాదనంటూ’’ ఆయన ఖండించారు.
కాల్ షీట్లకు.. షీట్లకు తేడా తెలియని వాళ్లు కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నాంటూ ప్రొడ్యూసర్ గిల్డ్‌పై ఫైర్ అయ్యాడు బండ్ల గణేష్. ఏ రోజు ఏ లైట్స్ వాడుతురో.. ఏ లోకేషన్‌కి ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియని వాళ్లు సినిమాలు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను నటుడిగా.. ప్రొడక్షన్ మేనేజర్‌గా.. ప్రొడ్యూసర్‌గా పనిచేశానని.. తనను ఇండస్ట్రీ ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదన్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇవన్నీ వేస్ట్ అని.. ఒక ఛాంబర్, కౌన్సిల్ ఉండాలని దానికి ఎప్పుడు కట్టుబడి ఉండాలని అన్నారు. సినిమాలు తీయని వాళ్లు కూడా గిల్డ్‌లో ఉన్నారని.. వాళ్లకు ఏం తెలుసని బండ్ల గణేష్ ప్రశ్నించాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.