నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఒంగోలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ వేడుకలను ప్రారంభించనుండగా.. ప్రకాశం జిల్లాలో శుక్ర, శనివారాల్లో ‘మహానాడు’జరుగుతోంది. కాగా అన్నగారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. ఆయన కుమారుడు, హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వీడియో రిలీజ్ చేశారు. మే 28న తమ తండ్రి, శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న అందరికి అభినందనలు తెలియజేశాడు. ఏడాది పాటు ఉత్సవాలు జరగనున్నట్లు ప్రకటించాడు. ఈ కార్యక్రమాల్లో నందమూరి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొంటారని తెలిపారు. ఆయన మాట్లాడిన వీడియోని శ్రీధర్ మరాఠి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Natasimham shri nandamuri balakrishna garu video bite about the 100thBirthAnniversaryCelebrations of shri NTR garu on May 28th at Nimmakuru. #CenternaryCelebrationsOfNTR#100thBirthAnniversaryOfNTR #NandamuriBalaKrishna #NBK #NTR#NBKforNTR pic.twitter.com/SnHaf0vFKm
— Sreedhar Marati (@SreedharSri4u) May 27, 2022
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ హిందూపురంలో కేవలం రూ.2కే పేదలకు నాణ్యమైన భోజనం అందించే పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి అన్నగారి భోజనశాల అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
టీడీపీకి కంచుకోట హిందూపురం..
హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి వరుసగా రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతం నుంచి టీడీపీ గెలిచిన మూడు అసెంబ్లీ స్థానాల్లో ఇదొకటి. 1983 నుంచి హిందూపురం నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోటలా ఉంది. 1985, 1989, 1994లో ఎన్టీఆర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1996లో ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.