టాలీవుడ్ లో రీమేక్ సినిమాల ట్రెండ్ ఇంకా జోరుగా సాగుతోంది. ఇటీవల ఏ భాషలో సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా వెంటనే రీమేక్ హక్కులు కొని పెట్టుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా మలయాళం సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. తాజాగా మరో మలయాళీ సూపర్ హిట్ మూవీ తెలుగులో రీమేక్ కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం రెండు పెద్ద బ్యానర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.
ఇంతకీ ఆ మలయాళం సినిమా ఏదంటే.. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలలో నటించిన ‘బ్రో డాడీ‘. తండ్రి కొడుకుల మధ్య సాగే వినూత్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించడంతో పాటు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. డైరెక్ట్ ఓటిటి(డిస్నీ హాట్ స్టార్) వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది.ఇప్పుడు ఈ బ్రో డాడీ సినిమా రీమేక్ చేసేందుకు తెలుగులో రెండు కుటుంబాలు ప్రయత్నిస్తున్నాయట. ఓవైపు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు.. మరోవైపు అక్కినేని నాగార్జున ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. అదీగాక ఈ సినిమా రెండు ఫ్యామిలీస్ కి కూడా చాలా స్పెషల్ అని చెబుతున్నారు. ఎందుకంటే.. సురేష్ బాబు ఎప్పటినుండో వెంకటేష్ – రానా లను ఒకే స్క్రీన్ పై చూడాలని తాపత్రయపడుతున్నారు.
ఆ కారణంగా బ్రో డాడీలో వెంకీ – రానా లను పెట్టి తీయాలని భావిస్తున్నారట. ఇక అక్కినేని నాగార్జునకి కూడా బ్రో డాడీ స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే.. నాగ్ కెరీర్లో ఇది 100వ సినిమా. అంతేగాక ఈ సినిమాలో నాగార్జున – అఖిల్ కలిసి నటిస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో విషయం ఏంటంటే.. నాగ్ 100వ సినిమా కోసం ఆల్రెడీ డైరెక్టర్ ని కూడా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం మెగాస్టార్ తో ‘గాడ్ ఫాదర్’ సినిమా తెరకెక్కిస్తున్న మోహన్ రాజా దర్శకత్వంలో నాగ్ 100వ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. అటు దగ్గుబాటి ఫ్యామిలీ – ఇటు అక్కినేని ఫ్యామిలీ రెండు కూడా పెద్ద బ్యానర్లే. కానీ సినిమా ఎవరి చేతిలోకి వెళ్లనుంది అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి.. తెరపై ‘బ్రో డాడీ’గా వెంకీ – రానా కనిపిస్తారా? లేక నాగ్ – అఖిల్ కనిపిస్తారా? అనేది. ఇక ‘బ్రో డాడీ’ రీమేక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.