అభిమాన సెలబ్రిటీలు పెళ్లి చేసుకునే వరకు ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త చెబుతుందా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అదే సెలబ్రిటీ పెళ్లి చేసుకొని సినిమాలలో బిజీ అయితే.. ఇంకెప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని చూస్తారు. కానీ.. ఎంత ఫేవరేట్ అయినా ఒకసారి పెళ్లి చేసుకుంటేనే అందం అంటారు. ఈ మధ్యకాలంలో ఒకే పెళ్లి అనే ట్రెండ్ పాతబడిపోయింది. ఏ సెలబ్రిటీ కూడా ఒక్క పెళ్లితో ఆగడం లేదు. తాజాగా రెండో పెళ్లి చేసుకున్న ఐదు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిందంటూ వార్తల్లోకెక్కింది నటి అంజలీ నాయర్.
ఈ మలయాళీ నటి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అటు మలయాళంతో పాటు తమిళంలో ఎన్నో సినిమాలు చేసింది. సర్ప్రైజింగ్ గా గతేడాది అన్నాతే సినిమాలో సూపర్ స్టార్ రజినీకి తల్లిగా నటించింది. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో పెళ్లి చేసుకున్నఅంజలి.. తాజాగా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయంతో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. అంజలి తాను ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది. అలాగే భర్త, కూతురుతో ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి బేబీ బంప్ పిక్స్ కూడా షేర్ చేసింది.
మొదట అంజలి మలయాళీ ఫిల్మ్ మేకర్ అనీష్ ఉపాసనను వివాహం చేసుకుంది. అయితే.. కొంతకాలానికే అతని నుండి విడాకులు తీసుకుంది. ఇక విడిపోకముందే అనీష్ తో అంజలికి ఒక కుమార్తె ఆవ్ని ఉంది. కూతురిని కూడా ‘5 సుందరికలు’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా డెబ్యూ చేయించింది. ఇక ఆ తర్వాత అంజలి అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్ రాజుతో ప్రేమలో పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అజిత్ రాజును పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. ఇక అంజలికి ఆడబిడ్డ పుట్టడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.